- Telugu News Photo Gallery Cinema photos Actress Trisha Krishnan Beautiful Looks In Ponniyin Selvan Anthem Launch Event Photos Goes Viral telugu cinema news
Trisha: కాలం మరిచిందేమో ఈ అమ్మాయిని.. వయసు పెరుగుతున్న తరగని అందం ఆమె సొంతం.. త్రిష బ్యూటీఫుల్ ఫోటోస్..
టాలీవుడ్ అందాల రాక్షసి త్రిషకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
Updated on: Apr 17, 2023 | 10:57 AM

టాలీవుడ్ అందాల రాక్షసి త్రిషకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. పెళ్లి మాటే ఎత్తకుండా తన ఫోకస్ మొత్తం చిత్రాలపైనే పెట్టేసింది.

ప్రస్తుతం ఆమె నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం పొన్నియన్ సెల్వన్ 2. గతంలోనే వచ్చిన ఫస్ట్ పార్ట్ కు కొనసాగింపుగా వస్తుందీ మూవీ.

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో విక్రమ్, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

అయితే చాలా కాలం సినిమాలకు గ్యాప్ తీసుకున్న త్రిష.. పొన్నియన్ సెల్వన్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మరింత అందంగా ముస్తాబై మెరిసింది.

తాజాగా నిన్న జరిగిన పొన్నియన్ సెల్వన్ ఈవెంట్లో త్రిష అందానికి ముగ్దులు కాకుండా ఉండలేరు. ఆమెకు సంబంధించిన బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతుంది.

40 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో అభిమానులను కట్టిపడేస్తుంది. ప్రస్తుతం ఆమె లియో చిత్రంలో నటిస్తుంది. ఈ ముద్దుగుమ్మకు మరిన్ని అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది.

కాలం మరిచిందేమో ఈ అమ్మాయిని.. వయసు పెరుగుతున్న తరగని అందం ఆమె సొంతం.. త్రిష బ్యూటీఫుల్ ఫోటోస్..




