పవన్ కళ్యాణ్ క్రేజీ ఫ్యాన్.. ఈ అమ్మడిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో అత్తారింటికి దారేది సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పవర్ స్టార్ భారీ విజయాన్ని అందుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి పతాకంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా 2013లో ఈ సినిమా విడుదలైంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా స్టార్ బ్యూటీ సమంత నటించారు. అలాగే బొమన్ ఇరానీ, నదియా, ప్రణీత, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. ఇక ఈ సినిమాలో భారీ విజయం సాధించడంతో పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది సినిమాలోని పాటలన్ని ఇప్పటికీ అలరిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ ఓ పేరడీ సాంగ్ చేశారు. ఈ సాంగ్ లో పవన్ బాబాజీ గెటప్ లో కనిపించి ఆకట్టుకున్నారు.
ఇక పై ఫొటోలో పవన్ కళ్యాణ్ తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా.? చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో సైడ్ డాన్సర్ గా కనిపించింది ఆమె. ఆమె పేరు కళ్యాణి.. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది కళ్యాణి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే కళ్యాణికి చాలా ఇష్టం. ఆయన తో చాలా ఫోటోలు దిగింది. ఇటీవలే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహరవీరమల్లు సినిమాలోనూ కళ్యాణి నటించింది.ఆ షూటింగ్ సెట్ లో ఆయనతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణి తన ఫోటోలు, రీల్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఈ ఫొటోల పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
