- Telugu News Photo Gallery Cinema photos Remembering Late Actress Soundarya On Her 19th Death Anniversary telugu cinema news
Soundarya Death Anniversary: ఆమె రూపం జనాల మదిలో పదిలం.. దివికేగిన అందాల తార సౌందర్య వర్ధంతి నేడు.. ఇంకా కళ్ల ముందు ఉన్నట్లే..
సౌందర్య.. ఈ పేరు చెప్పగానే ప్రేక్షకుల హృదయాల్లో తెలియని అలజడి. అందమైన రూపం.. చిన్న వయసులోనే స్టార్ డమ్. అంతలోనే పెను విషాదం. తెలుగు తెర అందాల తార సౌందర్య 19వ వర్ధంతి నేడు. ఇప్పటికీ ఆమెను సినీప్రియులు తలచుకుంటూనే ఉన్నారు.
Updated on: Apr 17, 2023 | 12:20 PM

సౌందర్య.. ఈ పేరు చెప్పగానే ప్రేక్షకుల హృదయాల్లో తెలియని అలజడి. అందమైన రూపం.. చిన్న వయసులోనే స్టార్ డమ్. అంతలోనే పెను విషాదం. తెలుగు తెర అందాల తార సౌందర్య 19వ వర్ధంతి నేడు. ఇప్పటికీ ఆమెను సినీప్రియులు తలచుకుంటూనే ఉన్నారు.

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి అప్పుడే 18 ఏళ్లు గడిచిపోయినప్పటికీ.. చెరగని చిరునవ్వు.. ఆమె రూపం ఇప్పటికీ ప్రేక్షకుల కళ్లముందే కదలాడుతోంది. అలనాటి మహానటి సావిత్రి తర్వాత అంతటి.. అందం.. అభినయం సౌందర్య సొంతమే.

కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాదు..అప్పట్లో కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ కూడా సౌందర్యనే. గ్లామర్ అంటే స్కిన్ షో మాత్రమే కాదు.. నటన అని నిరూపించింది. చక్కటి చీరక్టటులో మంచి కట్టూ, బొట్టు కలబోసిన నిండైన రూపంతో పదహారణాల తెలుగుమ్మాయిలా.. గృహిణిగా కన్పించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అప్పట్లో ఎలాంటి గ్లామర్ షో చేయకుండానే చీరకట్టులో నటిస్తూ.. కొన్నేళ్లపాటు అగ్రకథానాయికగా కొనసాగింది. సౌందర్య మరణం సినీపరిశ్రమకు తీరని లోటు. ఇప్పటివరకు ఆ అందాల తారను మరిపించే నటి రాలేదు.

1972 జూలై 17న కర్ణాటకలోని కొలార్ లో సత్యనారాయణ, మంజుల దంపతులకు జన్మించింది సౌందర్య. ఆమె అసలు పేరు సౌమ్య... కాగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత సౌందర్యగా మార్చుకున్నారు.

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే సినీపరిశ్రమ నుంచి పిలుపు రావడంతో నటనవైపు మళ్లింది. అలా డాక్టర్ కావాల్సిన ఆమె.. నటిగా మారింది దక్షిణాది చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది.

మనవరాలి పెళ్లి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సౌందర్య.. తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళీ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 100 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు.

సినిమా కెరీర్ పీక్స్ లో ఉండగానే.. తన మేనమామ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన జి.ఎస్.రఘును 2003 ఏప్రిల్ 27న వివాహం చేసుకున్నారు. ‘అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్’ ద్వారా సామాజిక సేవ కూడా చేసింది.

సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ రాణించాలనుకుంటున్న సమయంలోనే అనుకోని ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్ 17న బెంగుళూరు నుంచి బీజేపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడానికి కరీంనగర్ వెళ్తుండగా.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు.

ఆమె రూపం జనాల మదిలో పదిలం.. దివికేగిన అందాల తార సౌందర్య వర్ధంతి నేడు.. ఇంకా కళ్ల ముందు ఉన్నట్లే..




