Video: W,W,W,W,W.. 5 బంతుల్లో 5 వికెట్లు.. ఫైనల్‌కు ముందే షాకిచ్చిన కివీస్ బౌలర్
Brett Randell 5 Wickets in 5 Balls: న్యూజిలాండ్ దేశీయ టోర్నమెంట్, ప్లంకెట్ షీల్డ్‌లో ఒక ప్రత్యేకమైన ఘనత చోటు చేసుకుంది. 30 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ బ్రెట్ రాండెల్ వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.

Brett Randell 5 Wickets in 5 Balls: ప్రస్తుతం ఎక్కడ చూసినా టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ ముచ్చటే కనిపిస్తోంది. భారత్, న్యూజిలాండ్ జట్లు మరికొద్దిసేపట్లో ఈ కీలక పోరుకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్ దేశీయ క్రికెట్‌లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. 30 ఏళ్ల వేగబౌలర్ బ్రెట్ట్ రాండెల్ (Brett Randell) ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడూ జరగని ఘనత సాధించాడు. ఫ్లంకెట్ షీల్డ్ (Plunket Shield) టోర్నమెంట్‌లో ఆడుతూ, కేవలం 5 వరుస బంతుల్లో 5 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇది 254 ఏళ్ల ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి జరిగింది.
5 బంతుల్లో 5 వికెట్లు రాండెల్ మాయాజాలం..
ఈ మ్యాచ్‌లో సెంట్రల్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం (Central Districts cricket team) తరపున ఆడిన బ్రెట్ రాండెల్, నార్తరన్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టీం (Northern Districts cricket team) పై భీకరంగా దాడి చేశాడు.
తన స్పెల్‌లో ఒక దశలో వరుసగా 5 బంతుల్లో 5 వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటింగ్ లైన్‌అప్‌ను పూర్తిగా కుదేలయ్యేలా చేశాడు. అతను మొత్తం ఒకే సెషన్‌లో 8 ఓవర్లలో 7 వికెట్లు పడగొట్టడం కూడా ప్రత్యేకంగా నిలిచింది.
ఈ ఐదు వికెట్లలో:
3 వికెట్లు – క్లీన్ బౌల్డ్
2 వికెట్లు – క్యాచ్ అవుట్
ఈ అద్భుత ప్రదర్శనతో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు కేవలం 9 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
మ్యాచ్ పరిస్థితి..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగులు చేసింది. దానికి ప్రత్యుత్తరంగా బ్యాటింగ్‌కు దిగిన నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ జట్టు పూర్తిగా కుప్పకూలింది.
దీంతో మొత్తం జట్టు 82 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇద్దరు బ్యాట్స్‌మన్ మాత్రమే డబుల్ ఫిగర్ చేరుకున్నారు.
బ్రెట్ రాండెల్ ఈ మ్యాచ్‌లో:
View this post on Instagram
11 ఓవర్లు బౌలింగ్ చేసి, 25 పరుగులు ఇచ్చి 7 వికెట్లు సాధించాడు.
ప్రత్యేక విషయం..
బ్రెట్ రాండెల్ గతంలో నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ తరఫునే ఆడాడు. ఇప్పుడు అదే జట్టుపై ఈ చారిత్రాత్మక ప్రదర్శన చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
