AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thaman: ‘ఇది ప్రారంభం మాత్రమే.. రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది’.. పవన్, సుజీత్ సినిమాపై తమన్ క్రేజీ అప్డేట్..

సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు ఓజీ అని టైటిల్ పిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్ తోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు.

Thaman: 'ఇది ప్రారంభం మాత్రమే.. రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది'.. పవన్, సుజీత్ సినిమాపై తమన్ క్రేజీ అప్డేట్..
Og Movie
Rajitha Chanti
|

Updated on: Apr 17, 2023 | 6:49 AM

Share

భీమ్లా నాయక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అందులో డైరెక్టర్ సముద్రఖని తెరకెక్కిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ లో తన పార్ట్ కంప్లీట్ చేసిన పవన్.. హరిహర వీరమల్లు.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్స్‏లో పాల్గొంటున్నారు. అలాగే సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో పవన్ ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు ఓజీ అని టైటిల్ పిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా అనౌన్స్ తోనే సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోకు సూపర్ రెస్పా్న్స్ వస్తోంది.

ఎప్పుడెప్పుడా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. షూటింగ్స్ గ్లింప్స్ లోని మ్యూజిక్ ఆడియన్స్ కు విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ మ్యూజిక్ తో వీడియోస్ చేస్తూ తమ అభిమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఓ వీడియోకు తమన్ స్పందిస్తూ.. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఓజీ సొంత రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు. తమన్ ఇచ్చిన అప్డేట్ తో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ సుజిత్.. పవన్ కాంబోలో రాబోతున్న సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!