AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shaakuntalam: పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న శాకుంతలం.. రెండు రోజుల్లో ఎంత వసూల్ చేసిందటే

పిరియాడికల్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది.

Shaakuntalam: పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోన్న శాకుంతలం.. రెండు రోజుల్లో ఎంత వసూల్ చేసిందటే
Shaakuntalam
Rajeev Rayala
|

Updated on: Apr 17, 2023 | 7:23 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక పిరియాడికల్  డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్ర‌తి ఫ్రేమ్‌ను అత్య‌ద్భుతంగా తెర‌కెక్కించే గుణ శేఖ‌ర్ ఏ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విడుదలైన రెండు రోజులకు ఎంత వసూల్ చేసిందంటే..

నైజాం 0.72 కోట్లు, సీడెడ్ 0.16 కోట్లు, ఉత్తరాంధ్ర 0.21 కోట్లు, ఈస్ట్ 0.12 కోట్లు, వెస్ట్ 0.04 కోట్లు, గుంటూరు 0.10కోట్లు, కృష్ణా 0.12 కోట్లు, నెల్లూరు 0.06 కోట్లు, ఏపీ, తెలంగాణ కలిపి 1.56 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 కోట్లు, మిగిలిన భాషల్లో 0.25 కోట్లు, ఓవర్సీస్ 0.85 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 2.89 కోట్లు వసూల్ చేసింది.

డా.మోహన్ బాబు, సచిన్ కేడ్‌కర్, గౌతమి, మధుబాల, ప్రకాష్ రాజ్, కబీర్ బేడి, అదితి బాలన్, అనన్య నాగళ్ల, వర్షిణి సౌందరరాజన్ వంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో నటించారు. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణశేఖ‌ర్ రూపొందించిన పౌరాణిక ప్రేమ కావ్యం ‘శాకుంతలం’.

Follow Us
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
హాఫ్ శారీలో తళుక్కుమన్న నటి రోజా.. ఫొటోస్ ఇదిగో
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
ఎప్పుడూ ఒకే కప్పులో టీ ఎందుకు తాగుతారు?సైకాలజీ చెప్పే రహస్యాలుఇవే
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
రష్మిక అన్నా అని పిలిచే టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
పచ్చిమిరపకాయలు త్వరగా పాడువుతున్నాయా.. ఇలా చేస్తే 15 రోజులైనా..
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
రొయ్య రైతు పొలికేక...! బరువు దించే నాథుడెక్కడ?
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పెడుతున్నారా..? అయితే, ఈ వీడియో మీ కోసమే..!
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
రైలులో ఎన్ని కేజీల లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా? లిమిట్‌ మించితే..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
కొత్తిమీర వీరికి యమ డేంజర్.. పొరపాటున తింటే ఈ సమస్యలు ఖాయం..
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశులివే
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!
తొలి ఏకాదశి..విష్ణుమూర్తి కృప కోసం 12 రాశుల వారు చేయాల్సినవి ఇవే!