Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: కృష్ణుడి గెటప్‏లో ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఆమె పేరులోనే కన్నయ్య ప్రేమంతా దాగుంది..

తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ అందమైన ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. నల్లనయ్య ఆ కృష్ణ పరమాత్ముడిగా మారిన ఆ అమ్మాయి ఒకప్పుడు మన తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతో స్క్రిన్ షేర్ చేసుకుంది.

Tollywood: కృష్ణుడి గెటప్‏లో ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి.. ఆమె పేరులోనే కన్నయ్య ప్రేమంతా దాగుంది..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 16, 2023 | 7:32 AM

తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్‏గా మెప్పించిన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. 80-90’s చేతి నిండా సినిమాలతో అగ్రకథానాయికలుగా వెలిగిన అలనాటి అందాల తారలు.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సహయనటులుగా అలరిస్తుంటే..మరికొందరు మాత్రం కుటుంబానికి తమ పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ అందమైన ఫోటో నెట్టింట వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. నల్లనయ్య ఆ కృష్ణ పరమాత్ముడిగా మారిన ఆ అమ్మాయి ఒకప్పుడు మన తెలుగు చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి.. బాలకృష్ణ వంటి అగ్రకథానాయకులతో స్క్రిన్ షేర్ చేసుకుంది. ముఖ్యంగా చిరుకు బెస్ట్ ఫ్రెండ్. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఎవరో గుర్తుపట్టండి. ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ షూరు చేసింది. అంతేకాదు.. ఈ హీరోయిన్ కూతురు కూడా కథానాయికే. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించినప్పటికీ తల్లి సంపాదించిన స్టార్ డమ్ అందుకోలేకపోయింది. దీంతో రెండు మూడు చిత్రాలు చేసి తర్వాత సైలెంట్ అయ్యింది. ఇంతకీ కృష్ణయ్యగా మారిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. తనే అలనాటి అందాల తార రాధ.

తెలుగుతోపాటు.. తమిళ్, మలయాళ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ రాధ. దర్శకుడు భారతీరాజా తెరకెక్కించిన అలైగల్ ఓవతిల్లై సినిమాతో రాధా సినీరరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ తో సినిమాలు చేసింది. అలాగే తెలుగులో గోపాలకృష్ణుడు, అత్తకు తగ్గ అల్లుళ్లు.. రాక్షసుడు, నాగు, ఆయుధం, అడవి దొంగ చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే తమ బంధువైన మణి అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుని ముంబైలో స్థిరపడ్డారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన రాధ.. ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. ఆమె పెద్ద కూతురు కార్తిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అక్కినేని నాగచైతన్య తొలి చిత్రం జోష్ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇదిలా ఉంటే.. నిన్న మలయాళీల పవిత్ర ఫేస్టివల్ విషు సందర్భంగా తాను కృష్ణుడిగా గెటప్ వేసుకున్న అరుదైన ఫోటోను పంచుకున్నారు రాధా.

View this post on Instagram

A post shared by Radha (@radhanair_r)

View this post on Instagram

A post shared by Radha (@radhanair_r)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
ఈ యాప్‌ల చుట్టూ స్కామర్లు.. డౌన్లోడ్ చేస్తే డబ్బులు మాయం
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
ICL ఫిన్‌కార్ప్‌ను నేషనల్ లెండింగ్ పార్టనర్‌గా నియమించిన NIDCC
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
బతుకు జీవుడా..! ఎట్టకేలకు ఏనుగు నుంచి తప్పించుకొని ఎలా బయటపడ్డాడో
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
రాయుడిని లైవ్‌లో ట్రోల్ చేసిన గబ్బర్
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
అమ్మాయి చేతులు చూసి మండపం నుంచి వరుడు జంప్..!
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
నిజమా? మే ఒకటి నుంచి ఫాస్టాగ్ పనిచేయదా?మరీ టోల్ ప్లాజాల సంగతేంటి?
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
ఎలుకల్ని తరిమి కొట్టేందుకుఈజీ టిప్స్‌.. ఇలా చేశారంటే రమ్మనా రావు!
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే
UPSC సివిల్స్‌ తుది ఫలితాలు విడుదల.. టాప్‌-10 ర్యాంకర్లు వీరే