Sai Dharam tej: ‘బాధ మనిషిని మార్చేస్తుంది.. టెన్షన్ పెట్టినందుకు క్షమించండి’.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్..

2009లో నా సినీ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మన జీవితాలు మారిపోతాయని మా అమ్మకు చెబుతూనే వచ్చాను. అది నిజం కావడానికి ఐదేళ్లు పట్టింది. 2016లో పరాజయాలు ఎదుర్కొన్నాను. ఆ ఫెయిల్యూర్ తో నేనేంటో నాకు అర్థం.

Sai Dharam tej: 'బాధ మనిషిని మార్చేస్తుంది.. టెన్షన్ పెట్టినందుకు క్షమించండి'.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ కామెంట్స్..
Sai Dharam Tej
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2023 | 8:19 AM

మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం విరూపాక్ష. ఇందులో సంయుక్త మీనన్ కథానాయకగా నటించింది. నూతన దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సినిమా ఈనెల 21న ఆడియన్స్ ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏలూరులో నిర్వహించింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ.. గతంలో తనకు జరిగిన ప్రమాదాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. బైక్ పై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

తేజ్ మాట్లాడుతూ.. “2009లో నా సినీ ప్రయాణం మొదలైంది. అప్పటి నుంచి మన జీవితాలు మారిపోతాయని మా అమ్మకు చెబుతూనే వచ్చాను. అది నిజం కావడానికి ఐదేళ్లు పట్టింది. 2016లో పరాజయాలు ఎదుర్కొన్నాను. ఆ ఫెయిల్యూర్ తో నేనేంటో నాకు అర్థం. సినీరంగంలోకి ఎందుకు వచ్చాను ? అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. చిత్రలహరి సినిమా తర్వాత నా కెరీర్ కుదుటపడింది. ఆ తర్వాత విడుదలైన ప్రతిరోజూ పండగే.. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2021 సెప్టెంబర్ 10న నేను అనుకోకుండా బైక్ పైనుంచి జారిపడ్డాను. నేను బైక్ నడపడం తప్పని చాలా మంది అన్నారు. నేను అలా అనుకోను. ఎందుకంటే నాకు బైక్ అంటే ప్రాణం. ఆ ప్రమాదం గురించి ఈ అందరికీ తెలిసిందే. దానివల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు క్షమించండి.

స్పృహ వచ్చాక ముందు చూసింది అమ్మా. తమ్ముణ్ణే. వారికి సారీ చెబుదామంటే నాకు మాట రాలేదు. బాధ మనిషిని మార్చగలదని నాకు అప్పుడర్థమైంది. జీవితం విసిరిన సవాలును స్వీకరించి మీ అందరితో ఎలాగైనా మాట్లాడాలని పిక్స్ అయ్యాను. మీలో స్పూర్తి నింపాలి. మీ ప్రేమను పొందాలనేదే నా ధ్వేయం. దాని కోసం ఎంతైనా కష్టపడతా. మీరు లక్ష్యం చేరుకునే క్రమంలో అవరోధాలు ఎదురైతే వెనుకడుగేయొద్దు. మీ తల్లిదండ్రులు.. గురువులు గర్వపడేలా చేయాలి. ప్రయాణించేటప్పుడు దయచేసి హెల్మెట్ వాడండి” అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.