Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్‏ ఏంటీ ఇలా మారిపోయింది.. సముద్ర తీరాన అందాల రాశి ఎవరో గుర్తుపట్టారా ?..

తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుని.. ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడిపేస్తుండగా.. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకే కనిపించకుండా పోయిన అందాల భామా

Tollywood: ఈ హీరోయిన్‏ ఏంటీ ఇలా మారిపోయింది.. సముద్ర తీరాన అందాల రాశి ఎవరో గుర్తుపట్టారా ?..
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 17, 2023 | 7:59 AM

ఇప్పటివరకు తెలుగు చిత్రపరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్స్ ప్రేక్షకులను అలరించారు. అందులో కొంతమంది అగ్రకథానాయికలుగా క్రేజ్ సంపాదించుకుంటే.. మరికొందరు ఒకటి రెండు చిత్రాలతో సరిపెట్టుకుంటారు. తొలి సినిమాతోనే హిట్ అందుకుని.. ఆ తర్వాత అదృష్టం కలిసిరాక సినీ పరిశ్రమకు దూరమైన ముద్దుగుమ్మల గురించి చెప్పక్కర్లేదు. కొందరు హీరోయిన్స్ చేసింది తక్కువ సినిమాలే అయినా.. ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. అలా తమకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుని.. ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో సంతోషంగా గడిపేస్తుండగా.. మరికొందరు వ్యాపారవేత్తలుగా రాణిస్తుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకే కనిపించకుండా పోయిన అందాల భామా షీల కౌర్. తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన షీలా.. నవదీప్ హీరోగా నటించిన సీతాకోకచిలుక సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన రాజు భాయ్ సినిమాలో కనిపించింది. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ నిర్మాణంలో వచ్చన హలో ప్రేమస్తారా మూవీలో మెరిసింది. అయితే ఈ చిత్రాలు ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఈ మూవీస్ తర్వాత స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో నటించింది. ఈ మూవీలో షీలా క్రేజ్ మారిపోయింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. అమాయకంగా కనిపిస్తూనే తెలుగు అడియన్స్ మదిని దొచుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ పోతినేని సరసన మస్కా, ఎన్టీఆర్ జోడిగా అదుర్స్ చిత్రంలో కనిపించింది. ఇందులో మోడరన్ గర్ల్ గా కనిపించింది.

అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ షీలా కెరీర్ అనుకున్నట్లుగా సాగలేదు. వరుస ఆఫర్లతో స్టార్ డమ్ అందుకుంటుందనుకునే సమయంలోనే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు. చివరిసారిగా ఆమె పరమవీరచక్ర చిత్రంలో కనిపించింది. అటు తెలుగులోనే కాకుండా.. మలయాళం, కన్నడ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించింది. 2020లో చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే తెలుగు వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యింది. ప్రస్తుతం షీలాకు ఓ పాప ఉంది. తాజాగా ఆమె తన భర్తతో కలిసి దిగిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI Match Report: ముంబైకి షాకిచ్చిన గుజరాత్..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
GT vs MI: బ్యాడ్ లక్ అంటే నీదే భయ్యా.. 2 మ్యాచ్‌ల్లో 2 సార్లు..
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
వరుసగా 3 బంతుల్లో 3 వికెట్.. కానీ హ్యాట్రిక్ మాత్రం కాదండోయ్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
రోహిత్‌ను బోల్తా కొట్టించిన సిరాజ్.. మియా సెలబ్రేషన్స్ వైరల్
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డయాబెటిస్ రోగులకు తేనె మంచిదేనా.? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
Video: ఐపీఎల్‌‌లోనే అత్యంత స్లో బాల్ విసిరిన ఆంధ్రా కుర్రాడు
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
ఉదయాన్నే ఖాళీ కడుపుతో అల్లం నీరు తాగితే శరీరంలో కలిగే మ్యాజిక్‌
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
మారుతి నుంచి సూపర్‌ మైలేజీ ఇచ్చే కొత్త తరం కారు.. ధర చౌకగానే..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమాకు వచ్చే డబ్బులన్నీ..
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు
హైదరాబాద్ ఇన్-కమ్ టాక్స్ అధికారులపై.. సీబీఐ కేసు