AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: మిస్టర్‌ కూల్‌ ధోనితో ఉన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? కుర్రాళ్ల ఫేవరెట్‌ హీరోయిన్‌ అండోయ్‌..

మిస్టర్‌ కూల్‌ను అభిమానించే వారిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ధోని ఫేవరెట్ క్రికెటర్‌. అతని కోసమే ఐపీఎల్‌లో చెన్నై మ్యాచ్‌లను వీక్షించేవారు చాలామంది ఉన్నారు. అందులో పైనున్న స్టార్‌ హీరోయిన్‌ కూడా ఒకరు.

MS Dhoni: మిస్టర్‌ కూల్‌ ధోనితో ఉన్న ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టారా? కుర్రాళ్ల ఫేవరెట్‌ హీరోయిన్‌ అండోయ్‌..
Ms Dhoni
Basha Shek
|

Updated on: Apr 16, 2023 | 11:11 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నా అతని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. మిస్టర్‌ కూల్‌ను అభిమానించే వారిలో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు ఉన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ధోని ఫేవరెట్ క్రికెటర్‌. అతని కోసమే ఐపీఎల్‌లో చెన్నై మ్యాచ్‌లను వీక్షించేవారు చాలామంది ఉన్నారు. అందులో పైనున్న స్టార్‌ హీరోయిన్‌ కూడా ఒకరు. పై ఫొటోలో ధోనితో ఉన్నది దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ హీరోయిన్‌. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. సినిమాల్లో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో కవ్వించే ఈ సొగసరికి ఫ్యాన్‌ బేస్‌ బాగానే ఉంది. ఇటీవలే మాస్ మహారాజా రవితేజతో కలిసి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మరి ఈ పాటికే అర్థమై ఉంటుంది ఈ క్యూటీ ఎవరో.. ఇంకా గుర్తుపట్టలేదా? అయితే నో ప్రాబ్లమ్‌ మేమే చెప్పేస్తాం లేండీ.. ధోనితో ఉన్న ఈ బ్యూటీ క్వీన్‌ మరెవరో కాదు.. మేఘా ఆకాశ్‌

ఇటీవల చెపాక్‌ వేదికగా చెన్నై వర్సెస్‌ రాజస్థాన్‌ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది మేఘ. మ్యాచ్‌ ఆద్యంతం చప్పట్లు కొడుతూ సీఎస్కేను ఎంకరేజ్‌ చేసింది. అయితే చెన్నై ఓడిపోవడంతో ఎంతో దిగాలు చెందింది. ఈ మ్యాచ్‌లో మేఘా ఆకాశ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్ లైఫ్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే ధోని తనకు ఇష్టమైన క్రికెటర్‌ అని చెప్పుకొచ్చింది. ఇదే క్రమంలో ధోనితో కలిసి ఆమె దిగిన కొన్ని ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. అందులోదే పై ఫొటో. ఇది ఏ సందర్భంలో తీసుకుందో గానీ అటు ధోని ఫ్యాన్స్‌ను, ఇటు మేఘా అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..