AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: కోహ్లీ ఫిఫ్టీ.. అనుష్క ముఖంలో ఎంత ఆనందమో.. బహుశా ఆ స్మైల్‌కే పడిపోయాడేమో..

బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు కోహ్లి సతీమణి అనుష్క శర్మ కూడా హాజరైంది. మ్యాచ్ ఆద్యంతం ఆర్బీబీని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టింది. ఇక మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్‌ సెంచరీ మార్క్ చేరుకోగానే లేచి నిలబడి చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టింది. విరాట్‌ కూడా ఫిఫ్టీ కొట్టగానే..

IPL 2023: కోహ్లీ ఫిఫ్టీ.. అనుష్క ముఖంలో ఎంత ఆనందమో.. బహుశా ఆ స్మైల్‌కే పడిపోయాడేమో..
Anushka Sharma, Virat Kohli
Basha Shek
|

Updated on: Apr 16, 2023 | 10:06 AM

Share

ఐపీఎల్‌- 2023 సీజన్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో కోహ్లీ టీం 23 పరుగులు తేడాతో గెలిచి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. విరాట్‌ కోహ్లీ (34 బంతుల్లో 50 పరుగులు, 6 ఫోర్లు, ఒక సిక్స్‌) ధనాధన్‌ లీగ్‌లో మూడో అర్ధ సెంచరీ కొట్టాడు. బెంగళూరు భారీస్కోరకు బాటలు వేసిన కోహ్లీకే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ పురస్కారలం లభించింది. కాగా బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు కోహ్లి సతీమణి అనుష్క శర్మ కూడా హాజరైంది. మ్యాచ్ ఆద్యంతం ఆర్బీబీని ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టింది. ఇక మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్‌ సెంచరీ మార్క్ చేరుకోగానే లేచి నిలబడి చిరునవ్వులు చిందిస్తూ చప్పట్లు కొట్టింది. విరాట్‌ కూడా ఫిఫ్టీ కొట్టగానే అనుష్క ఉన్న స్టాండ్స్‌ వైపు తన బ్యాట్‌ను చూపిస్తూ సెలబ్రేషన్స్‌ చేసుకున్నాడు. ప్రస్తుతం విరాట్‌- అనుష్క సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

మ్యాచ్‌లో కోహ్లీ- అనుష్కల వీడియోలపై అభిమానులు స్పందిస్తూ ‘ కింగ్‌ ఎప్పుడూ తన క్వీన్‌ను ఎప్పుడు నిరాశపరచడు’.. ‘బహుశా ఆ స్మైల్‌కే మా కోహ్లి భయ్యా పడిపోయి ఉంటాడు.. దటీజ్‌ కింగ్‌ కోహ్లి’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..