NTR 30: ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌కు పూనకాలే

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నాడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌. అయితే ఇప్పుడు ఆ గ్యాప్‌ను కవర్ చేస్తూ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా మారిపోయాడు తారక్ . కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటిస్తోన్న ఎన్టీఆర్‌ 30 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ..

NTR 30: ఆ పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి అడుగుపెట్టిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఫ్యాన్స్‌కు పూనకాలే
Ntr, Saif Alikhan
Follow us
Basha Shek

|

Updated on: Apr 18, 2023 | 12:55 PM

ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ తర్వాత కొద్దిగా గ్యాప్‌ తీసుకున్నాడు యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌. ఆ గ్యాప్‌ను ఇప్పుడు కవర్ చేస్తూ షూటింగ్‌లో ఫుల్‌ బిజీగా మారిపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో తారక్‌ నటిస్తోన్న ఎన్టీఆర్‌ 30 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో దివంగత అందాల నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఎన్టీఆర్‌ 30 సెట్‌లోకి ఇప్పుడు విలన్‌ సైఫ్‌ అలీఖాన్‌ కూడా ఎంటర్‌ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా ఎన్టీఆర్, కొరటాలతో సైఫ్‌ దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇందులో ఎన్టీఆర్‌, సైఫ్ ఇద్దరూ స్టైలిక్‌ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కు కనువిందు చేశారు. కాగా గతంలో ఎన్టీఆర్‌ 30 నుంచి సైఫ్‌ బయటకొచ్చేశాడనే రూమర్స్ వినిపించాయి. దీంతో మరో విలన్‌ కోసం మూవీ టీమ్‌ అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజా ఫొటోలతో ఈ రూమర్స్‌ అన్నింటికీ చెక్‌ పడినట్లు అయింది. కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌- సైఫ్‌ మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇవి కచ్చితంగా ఎన్టీఆర్‌ అభిమానులను అలరిస్తాయంటున్నారు మేకర్స్‌.

ఎన్టీఆర్‌ 30 సినిమాకు కోలీవుడ్ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్ గా.. బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై కల్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్‌గా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్‌ కానుంది. కాగా ఎన్టీఆర్‌ 30తో పాటు ప్రభాస్‌ ఆదిపురుష్‌ సినిమాలో రావణుడిగా నటిస్తున్నాడు సైఫ్‌. ఇందులో అతని పాత్రకు సంబంధించిన స్టిల్స్‌ ఇప్పటికే నెట్టింట్లో వైరలవుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్‌ రానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర