Prabhu Deva: ప్రభుదేవాతో కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ హ్యాండ్సమ్‌ కుర్రాడు ఎవరో తెలుసా?

ఇటీవల చెన్నైలోని చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా చాలా రోజుల తర్వాత చెన్నై వేదికగా జరిగిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌కు అభిమానులు, సెలబ్రిటీలు పోటెత్తారు. అందులో ప్రభుదేవా కూడా ఉన్నాడు.

Prabhu Deva: ప్రభుదేవాతో కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేస్తున్న ఈ హ్యాండ్సమ్‌ కుర్రాడు ఎవరో తెలుసా?
Prabhu Deva
Follow us
Basha Shek

|

Updated on: Apr 19, 2023 | 1:35 PM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఐపీఎల్‌ ఫీవర్‌ నడుస్తోంది. సామాన్యులతో పాటు సినిమా తారలు కూడా ధనాధన్‌ లీగ్‌ మ్యాచ్‌లపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. స్టేడియాలకు వెళ్లి మరీ ఫ్యాన్స్‌తో కలిసి మ్యాచ్‌లు చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా ఇండియన్ మైఖేల్‌ జాక్షన్‌, స్టార్‌ కొరియో గ్రాఫర్‌ ప్రభుదేవా కూడా స్టేడియానికి వెళ్లి మ్యాచ్‌ చూశాడు. ఇటీవల చెన్నైలోని చెపాక్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, లక్నో సూపర్ జెయింట్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా చాలా రోజుల తర్వాత చెన్నై వేదికగా జరిగిన ఈ ఐపీఎల్‌ మ్యాచ్‌కు అభిమానులు, సెలబ్రిటీలు పోటెత్తారు. అందులో ప్రభుదేవా కూడా ఉన్నాడు. తాజాగా గ్యాలరీలో మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోను ట్విట్టర్ లో షేర్‌ చేసుకున్నాడు. అయితే ఆ ఫొటోలో ప్రభుదేవాతో పాటు అతని ఓ పక్కన ఓ హ్యాండ్సమ్‌ కుర్రాడు ఉన్నాడు. దీంతో చాలామంది ఈ కుర్రాడెవరబ్బా? అని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆ అబ్బాయి మరెవరో కాదు స్వయానా ప్రభుదేవా కుమారుడే. మ్యాచ్‌ చూడడం కోసం కుమారుడితో కలిసి చెన్నైకు వచ్చాడు ప్రభుదేవా. ప్రస్తుతం ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా అది కాస్తా వైరలైంది. కాగా ప్రభుదేవాకు మొదట రామలతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆ తర్వాత ప్రభుదేవా నయనతారను ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యారు. అయితే మొదటి భార్యతో విడాకులు తీసుకోకపోవడం వల్ల నయనతార-ప్రభుదేవా పెళ్లికి ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఇక మొదటి భార్యతో విడాకులు తీసుకున్న 9 ఏళ్ల తర్వాత ప్రభుదేవా లాక్‌డౌన్‌ కాలంలో సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. తనకు సేవలు చేసిన హిమానీ అనే ఫిజియో థెరపిస్టును ప్రభుదేవా వివాహం చేసుకున్నారు.

కాగా ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ప్రభుదేవాకు ప్రత్యేక స్థానముంది. కొరియోగ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా, నటుడిగా, నిర్మాతగా.. ఇలా పలు విభాగాల్లో సత్తాచాటారాయన. హీరోగా ఈ ఏడాది భగీరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభుదేవా. అలాగే గతేడాది చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాకు నృత్య రీతులు సమకూర్చారు. ఇక సల్మాన్‌ ఖాన్‌ తో తీసిన రాధే నిరాశపర్చడంతో డైరెక్టర్‌గా మరే సినిమా చేయలేదు ప్రభుదేవా. ప్రస్తుతం నటుడిగా, కొరియాగ్రాఫర్‌గా ఎక్కవగా సినిమాల్లో కనిపిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..