Geetha Govindam Movie: గీతా గోవిందం సినిమాలో విజయ్ వెంటపడ్డ ఈ బ్యూటీ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లెక్చరర్ పాత్రలో నటించగా.. అతని స్టూడెంట్ గా నీలు కనిపించింది. విజయ్ ను ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకో అంటూ వెంటపడుతుంది. ఈ సినిమాలో ఆమె నటనతో మెప్పించింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో తెలుసా.. తన అసలు పేరు అనీషా డామా. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కనిపించింది తక్కువే.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిన చిత్రం గీతా గోవిందం. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించారు. 2018లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో విజయ్, రష్మిక కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో రష్మిక కంటే ఎక్కువగా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఓ అమ్మాయి. కనిపించింది తక్కువ సమయమే కానీ.. ఇప్పటికీ ఆడియన్స్ మదిలో నిలిచిపోయింది. తనే గోవిందుడి వెంటపడే నీలు అనే అమ్మాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లెక్చరర్ పాత్రలో నటించగా.. అతని స్టూడెంట్ గా నీలు కనిపించింది. విజయ్ ను ప్రేమిస్తున్నానంటూ.. పెళ్లి చేసుకో అంటూ వెంటపడుతుంది. ఈ సినిమాలో ఆమె నటనతో మెప్పించింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటో తెలుసా.. తన అసలు పేరు అనీషా డామా. ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ కనిపించింది తక్కువే.
గీతా గోవిందం సినిమాతోపాటు.. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ మూవీ తర్వాత ఓబేబీ సినిమాలో రావు రమేష్ కూతురిగా కనిపించింది. అంతేకాకుండా.. పెళ్లి కూతురు పార్టీ మూవీలోనూ మెరిసింది. కానీ ఈ చిత్రాలేవి అనీషాకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. అయితే ఇటీవలే ఆమె ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న సత్తిగాని రెండెకరాలు చిత్రంలో కథానాయికగా నటించింది. ఇందులో పుష్ప ఫేమ్ నటుడు కేశవ హీరోగా కనిపించాడు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. అయితే తెలుగులో అనీషా కథానాయికగా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. అనీషా.. 1996లో సెప్టెంబర్ 1న హైదరాబాద్ లో జన్మించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.