- Telugu News Photo Gallery Cinema photos Actress Samyuktha Interesting Comments About Sai Dharam Tej Movie Virupaksha telugu cinema news
Samyuktha: నందినికి పొగరు.. పట్టుదల ఎక్కువే.. నాతో పోలికే లేదంటున్న సంయుక్త..
ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో పుల్ జోష్ మీదున్నారు సంయుక్త మీనన్. ఇప్పటికే బింబిసార, సార్ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఆమె.. ఇప్పుడు విరూపాక్ష సినిమాతో సందడి చేయబోతున్నారు.
Updated on: Apr 19, 2023 | 11:19 AM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో పుల్ జోష్ మీదున్నారు సంయుక్త మీనన్. ఇప్పటికే బింబిసార, సార్ చిత్రాలతో హిట్స్ అందుకున్న ఆమె.. ఇప్పుడు విరూపాక్ష సినిమాతో సందడి చేయబోతున్నారు.

సాయి ధరమ్ తేజ్, సంయుక్త జంటగా నటించిన సినిమా విరూపాక్ష. కార్తీక్ దండూ తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ క్యూరియాసిటినీ పెంచేశాయి. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ జోరందున్నారు. వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేస్తున్నారు చిత్రయూనిట్.

ఇందులో భాగంగా ఇటీవల విలేకర్ల సమావేశంలో సంయుక్త ఆసక్తికర కామెంట్స్ చేశారు. విరూపాక్ష.. మిస్టిక్ థ్రిల్లర్ గా రూపొందిందని.. హారర్ మూవీ కాదని.. కానీ ప్రేక్షకులు భయపడతారని.. 1990ల నాటి కాలంలో ఈ కథ జరుగుతుందన్నారు.

బింబిసార తర్వాత తాను సంతకం చేసిన రెండో సినిమా విరూపాక్ష అని.. కానీ కరోనా.. తేజ్ ప్రమాదం కారణంగా మూవీ ఆలస్యమైందని అన్నారు.

విరూపాక్ష ఒప్పుకున్న తర్వాతే భీమ్లానాయక్, సార్ సినిమాలు రిలీజ్ అయ్యాయని అన్నారు. రుద్రవనం అనే గ్రామంలో జరిగే కథే విరూపాక్ష అని అన్నారు.

ఇందులో నందిని అనే పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశానని.. నందినికి పొగరు, పట్టుదల ఎక్కువ ఉంటుందని.. కానీ నిజ జీవితంలో తనకు అవేమి లేవని అన్నారు. అసలు నందిని పాత్రకు తనకు పోలీకే లేదన్నారు.





























