- Telugu News Photo Gallery Cinema photos Bollywood actress Mahie Gill surprised fans her secret marriage with long time boyfriend Ravi Kesar
సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ‘నేను చాలా పిరికిదాన్ని.. అందుకే..’
గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. పెళ్లికాకుండానే తల్లవుతున్నావా? అంటూ ఆరా తీస్తున్నారు. ఈ షాక్ ను నుంచి బయపడకముందే మరో బాలీవుడ్ బ్యూటీ సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు..
Updated on: Apr 19, 2023 | 11:45 AM

గోవా బ్యూటీ ఇలియానా ఇటీవల తన ప్రెగ్నెన్సీ విషయం బయటపెట్టడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. పెళ్లికాకుండానే తల్లవుతున్నావా? అంటూ ఆరా తీస్తున్నారు. ఈ షాక్ ను నుంచి బయపడకముందే మరో బాలీవుడ్ బ్యూటీ సీక్రెట్‌గా రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.

బాలీవుడ్ స్టార్ నటి మహి గిల్ రహస్యంగా రెండో పెళ్లి చేసుకుంది. నటుడు, వ్యాపారవేత్త అయిన రవికేసర్‌తో తన వివాహ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అధికారికంగా ప్రకటించారు. రవి కేసర్‌ను వివాహం చేసుకున్నానని, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షలంలో వారి వివాహ వేడుక జరిగిందని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

ఐతే వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు గానీ, వీడియోలను గానీ మహి సోషల్ మీడియాలో పోస్టు చేయలేదు. నిజానికి మహికి ఇది రెండో వివాహం. రవి కేసర్‌తో పెళ్లయ్యే నాటికే ఆమెకు ‘విరోనికా’ అనే కూతురు కూడా ఉంది.

'వ్యక్తిగత కారణాల వల్ల నా కూతురి వివరాలు, నా సీక్రెట్ వెడ్డింగ్ గురించి వెల్లడించలేకపోయాను. నేను చాలా ప్రైవేట్, పిరికిదాన్ని. నా జీవితంలో జరిగిన చాలా విషయాలు బయటి ప్రపంచానికి తెలియవు' అని మహి అన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే మహి చివరిసారిగా సోనీ లైవ్ షో యువర్ హానర్‌లో కనిపించారు. ఇందులో యశ్‌పాల్ శర్మ, పరుల్ గులాటీ, జిమ్మీ షీర్‌గిల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. 2003లో విడుదలైన బాలీవుడ్ మువీ హవాయిన్‌తో సినిమాల్లోకి ప్రవేశించిన మహి.. ఆ తర్వాత ఖోయా ఖోయా చంద్, దేవ్ డి, గులాల్, దబాంగ్, సాహెబ్, బివి ఔర్ గ్యాంగ్‌స్టర్, పాన్ సింగ్ తోమర్.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.




