Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vikram: 12 ఏళ్ల వయసులో యాక్సిడెంట్.. 4 ఏళ్లు కదల్లేని స్థితిలో బెడ్ పైనే.. 23 ఆపరేషన్స్.. కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్..

విక్రమ్ కు నార్త్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఆయన నటించిన చిత్రాలన్ని హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే ఇంతటి అభిమానాన్ని సంపాదించుకోవడంలో విక్రమ్ కు అంత సులువుగా జరగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి ఇక్కడి వరకు వచ్చారు.

Vikram: 12 ఏళ్ల వయసులో యాక్సిడెంట్.. 4 ఏళ్లు కదల్లేని స్థితిలో బెడ్ పైనే.. 23 ఆపరేషన్స్.. కట్ చేస్తే ఇప్పుడు సూపర్ స్టార్..
Chiyaan Vikram
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 19, 2023 | 9:05 AM

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు చియాన్ విక్రమ్. తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ ఈ హీరోకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు విక్రమ్. 57 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ.. యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం తెరకెక్కిస్తున్న పొన్నియన్ సెల్వన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభితా ధూళిపాళ్ల నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రప్రమోషన్స్ జోరందుకున్నాయి. విక్రమ్ కు నార్త్ ఆడియన్స్ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. ఆయన నటించిన చిత్రాలన్ని హిందీలో బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అయితే ఇంతటి అభిమానాన్ని సంపాదించుకోవడంలో విక్రమ్ కు అంత సులువుగా జరగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఇండస్ట్రీలోకి ఇక్కడి వరకు వచ్చారు.

విక్రమ్ కెరీర్ లో ఎన్నో కష్టాలు ఉన్నాయి. అతనికి కేవలం 12 ఏళ్ల వయసులోనే అతిపెద్ద ప్రమాదం జరిగింది. ఈ సమయంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతని కాలు తీసివేయాలని వైద్యులు సలహా ఇచ్చారు. కానీ అందుకు విక్రమ్ తల్లి అంగీకరించలేదు. విక్రమ్ కు 12 ఏళ్ల వయసులోనే నటించాలనే ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో ఓ చిత్రం మూగ అబ్బాయి పాత్ర ఆఫర్ వచ్చింది. ఈ పాత్రకు గానూ అతనికి ఐఐటీ మద్రాసులో ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నారు. ఈ అవార్డ్ ప్రధానోత్సవం తర్వాత తన స్నేహితుడితో కలిసి బైక్ పై వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. అందులో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అతని కాలు తీసివేయాలని వైద్యులు చెప్పగా.. అతని తల్లి ఒప్పుకోలేదు. ప్రమాదం తర్వాత దాదాపు 4 సంవత్సరాలు బెడ్ పైనే ఉండాల్సి వచ్చిందదట. కుడికాలు పూర్తిగా గాయపడిందని.. చీలమండ నుంచి మోకాలి వరకు ఎముకలు విరిగి.. చర్మం కందిపోయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విక్రమ్.

తన కాలికి ఇన్ఫెక్షన్ వచ్చిందని.. తనను కాపాడేందుకు 4 ఏళ్లలో 23 ఆపరేషన్స్ చేయాల్సి వచ్చిందట. దాదాపు 3 సంవత్సరాలు బెడ్ పై ఉండగా.. పూర్తిగా కోలుకోవడానికి ఒక సంవత్సరం పాటు క్రచెస్, వీల్ చైర్ ఉపయోగించినట్లు తెలిపారు. నటుడు కావాలనే తపన అయినా తనకు తగ్గలేదని.. తాను పూర్తిగా కోలుకుని.. ఇలా ఇప్పుడు నిల్చున్నందుకు తన తల్లి సహాకరం ఎంతో ఉందని అన్నారు. 1990లో ఎన్ కాదల్ కన్మణి సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు విక్రమ్. కానీ ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. పదేళ్ల తర్వాత ఆయన నటించిన సేతు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత విక్రమ్ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.