AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laya: హీరోయిన్ లయ కుమార్తెను చూశారా..? అమ్మను మించిన అందం.. ఆల్రెడీ ఓ సినిమాలో…

టాలీవుడ్‌లో ప‌దేళ్ల‌పాటు హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసిన‌ లయ అమెరికాలో సెటిలయ్యింది. స్వయంవరం ఆమె ఫస్ట్ సినిమా. త్రివిక్ర‌మ్ స్టోరీ, డైలాగ్స్ అందించిన ఈ సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించింది లయ. లయ కుమార్తెను మీరు ఎప్పుడైనా చూశారా..?

Laya: హీరోయిన్ లయ కుమార్తెను చూశారా..? అమ్మను మించిన అందం.. ఆల్రెడీ ఓ సినిమాలో...
Actress Laya
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2023 | 9:04 AM

Share

తెలుగమ్మాయి లయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అందం, అభియనంతో ఆమె తెలుగు జనాల మనసుల్లో ఎప్పుడో ప్లేస్ సంపాదించుకుంది. ‘భద్రం కొడుకో’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి పరిచయమైంది లయ. ‘స్వయంవరం’ సినిమాతో హీరోయిన్‌‌‌గా మారింది. ఆ తర్వాత లయకు అవకాశాలు క్యూ కట్టాయి. ముఖ్యంగా  కుటుంబ చిత్రాల కథానాయకిగా పేరుతెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ప‌దేళ్ల‌పాటు హీరోయిన్‌గా రాణించింది. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. లయ టాప్ క్లాస్ చెస్ ప్లేయర్. రెండో తరగతిలో వున్నప్పుడే చదరంగంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. రాష్ట్రస్థాయిలో ఏడుసార్లు, జాతీయస్థాయిలో ఒకసారి పతకాలు కూడా గెలుచుకుంది. టెన్త్ క్లాస్ వరకు చెస్ పోటీలలో పాల్గొంది.

పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది లయ.  భర్తతో కలిసి అమెరికాలో సెటిల్ అయ్యింది. తన భర్త పేరు గణేష్ గోగుర్తి అమెరికాలో ఫేమస్ డాక్టర్. ఇక లయ కూడా అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఇక తన భర్త  సినిమాలు మానేయాలని చెప్పలేదని.. కానీ బిజీ లైఫ్, పిల్లలు కారణంగా అక్కడే ఉండిపోయినట్లు వెల్లడించింది.  లయ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె ప్రజంట్ నైన్త్ క్లాస్ కాగా.. కుమారుడికి 12 ఏళ్లు ఉంటాయి.

ఇక లయ తనయ శ్లోకా రవితేజ నటించిన అమర్ అక్బర్ ఆంటోని మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించింది. శ్లోక కూడా లయ లాగా ఎంతో అందంగా ఉంటుంది. అచ్చం అమ్మ అందమే కుమార్తెకు వచ్చింది. వారిద్దర్నీ చూస్తే తల్లీకూతుళ్లు అనుకోరు. అక్కాచెల్లెళ్లు అనుకుంటారు. తన కుమార్తె హీరోయిన్‌గా ఓ సినిమాలోనైనా నటిస్తే చూడాలని ఉందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు లయ. దీంతో శ్లోక కూడా ఇండస్ట్రీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Laya -- Sloka

Laya — Sloka

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే