Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్‌ ‘స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌’ హీరోయిన్‌ ఎందుకు సినిమాలకు దూరమైంది? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

నిన్ను చూడాలని సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ మూవీ మంచి బ్రేక్‌ ఇచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా గజాలా నటించింది. అందులో ఎన్టీఆర్‌ వెంటపడి మరీ ప్రేమించే అంజలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

ఎన్టీఆర్‌ 'స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌' హీరోయిన్‌ ఎందుకు సినిమాలకు దూరమైంది? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Actress Gajala
Follow us
Basha Shek

|

Updated on: Apr 19, 2023 | 11:26 AM

నిన్ను చూడాలని సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్‌కు స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ మూవీ మంచి బ్రేక్‌ ఇచ్చింది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా గజాలా నటించింది. అందులో ఎన్టీఆర్‌ వెంటపడి మరీ ప్రేమించే అంజలి పాత్రలో అందరినీ ఆకట్టుకుంది. అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ జగపతిబాబుతోనాలో ఉన్న ప్రేమ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌ సినిమాతో సూపర్‌హిట్ సినిమా ఖాతాలో వేసుకుంది. ఆతర్వాత ఉదయ్‌ కిరణ్‌ కలుసుకోవాలని, ఎన్టీఆర్‌ అల్లరి రాముడు, అల్లరి నరేశ్‌ తొట్టి గ్యాంగ్‌, రోహిత్ జానకి వెడ్స్‌ శ్రీరామ్‌, భద్రాద్రి, మద్రాసి, శ్రావణమాసం, విజయం తదితర సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తమిళ్‌ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తెలుగులో స్టార్‌ హీరోల సరసన యాక్ట్‌ చేసిన గజాలా ఉన్నట్లుండి సినిమాలకు దూరమైంది. 2011లో విడుదలైన మనీ మనీ, మోర్‌ మనీ సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించింది.

కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు గజాలా సినీ ఇండస్ట్రీకి దూరం కావడంపై అప్పట్లో పలు రూమర్లు వచ్చాయి. ఓ యువ హీరోతో ఆమె ప్రేమలో పడిందని, విఫలం కావడంతో డిప్రెషన్‌కు గురైందని, ఆ మనస్థాపంతోనే ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించిందని ప్రచారం జరిగింది. 2014లో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గజాలా..’నేను సినిమాలకు కెరీర్‌గా భావించలేదు. మూవీస్‌ను ఆస్వాదించాను కాబట్టే హీరోయిన్‌గా చేశాను. చాలామందిలా 40-50 ఏళ్లు వచ్చే వరకు సినిమాలు చేయాలనుకోలేదు’ అని చెప్పుకొచ్చింది. ఇక 2016లో బాలీవుడ్‌ టీవీ నటుడు ఫైజల్ రాజా ఖాన్‌ను వివాహం చేసుకొంది గజాలా. ఆతర్వాత ముంబైకు వెళ్లి స్థిరపడింది. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది గజాలా. ప్రస్తుతం ఆమె వయసు 37 ఏళ్లు. అయినా ఇప్పటికీ ఎంతో అందంగానే కనిస్తోంది అందాల తార.

గజాలా ఫొటోలు:

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ
కెప్టెన్సీని విడిచిపెట్టే ముందు పరాగ్‌కు షాకిచ్చిన బీసీసీఐ