Priyanka Mohan: ‘గ్యాంగ్ స్టర్’ సెట్లో అడుగుపెట్టిన ప్రియాంక మోహన్.. పవన్ సరసన ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ..
మరోవైపు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. తాజాగా మంగళవారం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సెట్ లో అడుగుపెట్టారు పవన్. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీలైనంత త్వరగా తన ప్రాజెక్ట్స్ అన్నింటిని కంప్లీట్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా తన మూవీస్ షూటింగ్స్ వేగవంతం చేశారు. మరికొన్ని నెలల్లో ఎలక్షన్స్ వస్తుండడంతో తన చేతిలో ఉన్న సినిమాలన్ని పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఇటీవలే వినోదయ సితం సినిమాలో తన రోల్ కంప్లీట్ చేశారు పవన్. మరోవైపు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. తాజాగా మంగళవారం ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ సెట్ లో అడుగుపెట్టారు పవన్. సాహో డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా షూటింగ్ సెట్ లో మంగళవారం అడుగుపెట్టారు పవన్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ తెగ వైరలయ్యాయి. ఇక ఈరోజు కన్నడ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ఓజీ సెట్ లో అడుగుపెట్టారు. ఇందులో ఆమె పవన్ సరసన నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే గ్యాంగ్ లీడర్, శ్రీకారం సినిమాల్లో నటించి మెప్పించింది. అటు తమిళంలో డాక్టర్, డాన్, ఈటీ సినిమాల్లో నటించి అలరించింది. ఇక ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది ఈ బ్యూటీ.
ఇక కొద్దిరోజులుగా ఓజీ సెట్స్ నుంచి వరుసగా అప్డేట్స్ వస్తుండడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు.. నటీనటుల సమాచారాన్ని త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది.
???????? ?????… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF
— DVV Entertainment (@DVVMovies) April 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.