Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. జులై నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ ‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు బిగ్‌ అలెర్ట్‌.. జులై నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల.. ఎలా బుక్‌ చేసుకోవాలంటే?
Tirumala
Follow us
Basha Shek

|

Updated on: Apr 20, 2023 | 10:00 AM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. జూలై నెల కోటాకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్ ‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్లను కూడా ఈరోజే విడుదల చేయనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి ఈ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇక శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూలై నెల ఆన్‌లైన్‌ కోటాను కూడా ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. శ్రీవారి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ సూచించింది. అలాగే నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

రేపు అంగప్రదక్షిణం టోకెన్లు..

ఇక శుక్రవారం (ఏప్రిల్ 21)న అంగప్రదక్షిణం టోకెన్లను రిలీజ్‌ చేయనున్నారు. జూలై నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల ను రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అలాగే వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను ఏప్రిల్ 21న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటా టికెట్లు ఏప్రిల్‌ 24న ఉదయం 10 గంటలకు, జూన్‌ నెల కోటా టికెట్లు ఏప్రిల్‌ 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ కానున్నాయి. మే, జూన్‌ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఏప్రిల్‌ 25న ఉదయం 10 గంటలకు, తిరుమలలో మే నెల గదుల కోటాను ఏప్రిల్‌ 26న ఉదయం 10 గంటలకు, తిరుపతిలో మే నెల గదుల కోటాను ఏప్రిల్‌ 27న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది టీటీడీ. మరిన్ని వివరాల కోసం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?