IPL 2023: 717 రోజుల తర్వాత ఐపీఎల్ ఎంట్రీ.. సూపర్ స్పెల్‌తో అదరగొట్టిన టీమిండియా పేసర్
గత కొద్ది కాలంగా గాయాలతో పాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు ఇషాంత్. ఈ కారణంగానే టీమిండియాలో కూడా చోటు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
టీమిండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ ఐపీఎల్-2023లో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. సుమారు 717 రోజుల తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ఢిల్లీ పేసర్ సూపర్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. గురువారం (ఏప్రిల్21) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన ఇషాంత్ 19 పరగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. కెప్టెన్ నితీశ్ రాణా(4), సునీల్ నరైన్ (4)లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ పంపించి ఢిల్లీని ఆధిక్యంలో నిలిపాడు. గత కొద్ది కాలంగా గాయాలతో పాటు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు ఇషాంత్. ఈ కారణంగానే టీమిండియాలో కూడా చోటు కోల్పోయాడు. అయితే ఈ ఏడాది జరిగిన మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఇషాంత్ శర్మను రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ఆరో మ్యాచ్‌లో కానీ ఇషాంత్‌కు మైదానంలో దిగే అవకాశం రాలేదు. ఇప్పుడీ అవకాశాన్ని చేజేతులా సద్వినియోగం చేసుకున్నాడు.
సీనియర్ పేసర్‌గా టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు ఇషాంత్. మొత్తం 108 టెస్టుల్లో 311 వికెట్లు పడగొట్టాడు. అలాగే 80 వన్డేల్లో 115 వికెట్లు, 14 టీ20 మ్యాచుల్లో 8 వికెట్లు నేలకూల్చాడు. ఇక 2019 వరకు రెగ్యులర్ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ మొత్తం 93 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు తీసుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. ఎట్టకేలకు ఐపీఎల్ 2023 సీజన్లో ఢిల్లీ బోణీ కొట్టింది. 128 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 4 బంతులు మిగిలి ఉండగా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్ స్పెల్‌తో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాంత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
718 days later, donning the DC blue and red, Dilli’s very own roared like he’d never left ??❤️#YehHaiNayiDilli #IPL2023 #DCvKKR pic.twitter.com/7hwSUlD6B7
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2023
A #QilaKotla homecoming like no other ?pic.twitter.com/ia5pmUyZSI
— Delhi Capitals (@DelhiCapitals) April 20, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..