AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ ‘గుండె ఝల్లుమంది’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

దివంగత హీరో ఉదయ్‌ కిరణ్‌ నటించిన ప్రేమకథా చిత్రాల్లో గుండె ఝల్లుమంది ఒకటి. కొన్ని నెలల క్రితం చనిపోయిన మదన్‌ ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్‌ కిరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటుతున్న అదితీ శర్మను తీసుకొచ్చారు మూవీ మేకర్స్‌

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ 'గుండె ఝల్లుమంది' హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Gunde Jhallumandi Movie
Basha Shek
|

Updated on: Apr 20, 2023 | 1:06 PM

Share

దివంగత హీరో ఉదయ్‌ కిరణ్‌ నటించిన ప్రేమకథా చిత్రాల్లో గుండె ఝల్లుమంది ఒకటి. కొన్ని నెలల క్రితం చనిపోయిన మదన్‌ ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. ఇందులో ఉదయ్‌ కిరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటుతున్న అదితీ శర్మను తీసుకొచ్చారు మూవీ మేకర్స్‌. తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో చక్కగా నటించిందీ ముద్దుగుమ్మ. అందం, అభినయం పరంగా అందరినీ ఆకట్టుకుంది. అలాగే ఉదయ్‌కిరణ్‌కు పర్‌ఫెక్ట్‌ జోడీగా సూటయ్యింది. సినిమాలోని పాటలు కూడా సూపర్‌ హిట్‌ అయ్యాయి. అయితే మూవీ మాత్రం యావరేజ్‌ రిజల్ట్‌తోనే సరిపెట్టుకుంది. దీని తర్వాత ఓం శాంతి అనే మల్టీ స్టారర్‌ మూవీలో కనిపించింది. ఈ సినిమాకు ప్రశంసలు వచ్చాయి కానీ కమర్షియల్‌ హిట్‌ కాలేదు. ఆతర్వాత బబ్లూ అనే ఓ సినిమాలోనూ నటించింది అదితి. ఇది కూడా బాక్సాఫీస్‌ వద్ద ఫెయిల్యూర్‌గా నిలిచింది. దీంతో టాలీవుడ్‌లో అదితీకి అవకాశాలు కరువయ్యాయి. ఆతర్వాత కొన్ని పంజాబీ, హిందీ సినిమాల్లో అదృష్టం పరీక్షించుకుంది. మొత్తం మీద తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ, తదితర భాషలలో కలిపి దాదాపుగా 12కి పైగా చిత్రాలలో నటించింది అదితీ శర్మ.

ఈక్రమంలో సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది అదితి. బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ‘సర్వర్ ఆహుజా’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అదితి శర్మ దంపతులకు ఒక పాప కూడా ఉంది. ప్రస్తుతం ఆమె తన ఫ్యామిలీతో పాటు తన భర్త బిజినెస్‌ పనులను కూడా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలకు దూరంగా ఉన్న అదితీ శర్మ సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడప్పుడూ తన ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. అలా తాజాగా ఆమె ఫొటోలను చూసిన నెటిజన్ల కంట పడ్డాయి. ఇందులో అప్పటికీ, ఇప్పటికీ ఎంతో అందంగా ఉంది అందాల తార. అమ్మయిన తర్వాత కూడా ఈ అమ్మడి అందం ఏ మాత్రం తగ్గడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

అదితీ శర్మ ఫొటోలు:

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..