Rajitha Chanti |
Updated on: Apr 20, 2023 | 12:55 PM
ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా కోలీవుడ్, మాలీవుడ్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇప్పటికే ఆషికా రంగనాథ్, సంయుక్త మీనన్, గౌరీ జీ కిషన్ వంటి ముద్దుగుమ్మలు తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమయ్యారు. అందం, అభినయంతో తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నారు.
ఇప్పుడు ముంభై బ్యూటీ సాక్షి వైద్య తెరపై సందడి చేయబోతున్నారు. అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
డైరెక్టర్ సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే చిత్రప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్.
మహారాష్ట్రలోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తికాగానే.. ఫ్యాషర్ రంగంలోకి అడుగుపెట్టింది. పలు యాడ్స్ చేసిన ఆమెకు ఏజెంట్ సినిమా ఛాన్స్ వచ్చింది.
ఈ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్న సాక్షి వైద్య హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.
తెలుగు తెరపై సందడి చేయనున్న సాక్షి వైద్య.. 'ఏజెంట్' బ్యూటీ అందమైన ఫోటోస్..