Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా IPL బెట్టింగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. రూ.50 లక్షల నగదు..

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ గట్టిగానే నడుస్తోంది. దీన్నే బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉన్నారు.

Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా IPL బెట్టింగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్.. రూ.50 లక్షల నగదు..
Cricket Betting
Follow us

|

Updated on: Apr 21, 2023 | 8:28 AM

ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ గట్టిగానే నడుస్తోంది. దీన్నే బెట్టింగ్ రాయుళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అందరూ ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే.. పోలీసులు మాత్రం బెట్టింగ్ రాయుళ్ల పని పట్టడంలో బిజీబిజీగా ఉన్నారు. నగర శివారులో బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేసి.. బెట్టింగ్‌ రాయుళ్లు బ్యాండ్‌ వాయిస్తున్నారు పోలీసులు. భారత్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతుంది. మ్యాచ్ స్టార్ట్ చేసే టాస్ దగ్గర నుంచి ఏ బంతికి ఏం జరుగుతుంది అనే దానిపై బెట్టింగ్ కడుతున్నారు. హైదరాబాద్ నగరశివారులో IPL బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసుల దాడి చేశారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సమీపంలో IPL క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడుల్లో 12 మందిని అరెస్టు చేయగా..ఐదుగురు పరారీలో ఉన్నారు.

నిందితుల నుంచి 50 లక్షల రూపాయల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షల 29 వేలు.. స్మార్ట్ ఫోన్స్ 20, 8 ల్యాప్ టాప్ లు.. 43 కీ ప్యాడ్ ఫోన్స్, 4 టీవీలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం కోటి 41 లక్షల 52 వేలు రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.

నిందితులపై గేమింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి రిమాండ్ తరలించామని, మిగిలిన ఐదుగురుని కూడా త్వరలోనే పట్టుకుంటామని మేడ్చల్ డీసీపీ సందీప్ రావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..