Manjari Fadnis: తెలుగు సినిమాలకు దూరంగా ‘శుభప్రదం’ హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

దివంగత దర్శకుడు, కళా తపస్వి సినిమాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యముంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలకు సమానంగా కథానాయికలకు ప్రాధాన్యమిచ్చేవారాయన. అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు బాగా ఆసక్తి చూపేవారు. అలా విశ్వనాథ్‌ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న హీరోయిన్లలో మంజరి ఫడ్నిస్‌ ఒకరు.

Manjari Fadnis: తెలుగు సినిమాలకు దూరంగా 'శుభప్రదం' హీరోయిన్‌.. ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Manjari Fadnis
Follow us
Basha Shek

|

Updated on: Apr 21, 2023 | 1:17 PM

దివంగత దర్శకుడు కళా తపస్వి సినిమాల్లో హీరోయిన్లకు ఎంత ప్రాధాన్యముంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హీరోలకు సమానంగా కథానాయికలకు ప్రాధాన్యమిచ్చేవారాయన. అందుకే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు బాగా ఆసక్తి చూపేవారు. అలా విశ్వనాథ్‌ సినిమాల్లో అవకాశం దక్కించుకున్న హీరోయిన్లలో మంజరి ఫడ్నిస్‌ ఒకరు. అల్లరి నరేశ్‌ హీరోగా తెరకెక్కిన శుభప్రదం సినిమాలో ఈ సొగసరి కథానాయికగా నటించింది. సినిమా అంతటా అచ్చమైన తెలుగమ్మాయిలా చీరకట్టుతో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఎందుకో గానీ సినిమా మాత్రం సక్సెస్‌ కాలేదు. కానీ మంజరి అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ముంబైకు చెందిన ఈ ముద్దుగుమ్మ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులోనూ అల్లరి నరేశే హీరో. ఇందులో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించిన మంజరి ఆ వెంటనే శుభప్రదం సినిమాలో ట్రెడిషినల్‌ లుక్‌లో కనిపించి మెప్పించింది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమా యావరేజ్‌గా నిలిచినా మంజరికి ఛాన్సులు బాగానే వచ్చాయి. రాజా ఇంకోసారి సినిమాతో పాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ శక్తి సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం దక్కించుకుంది. అయితే ఆమె దురదృష్టమేమో రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి.

ఈ క్రమంలో తెలుగు తెరకు దూరమైన మంజరి హిందీలో అదృష్టం పరీక్షించుకుంది. గ్రాండ్‌ మస్తీ, సర్వ్‌ మంగళ్‌ సావధాన్‌, కిసి కిసికో ప్యార్‌ కరూన్‌, నిర్దోశ్‌ వంటి సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం అడపాదడపా హిందీ సినిమాల్లో కనిపిస్తూనే వెబ్‌ సిరీసుల్లో నటిస్తోంది. ఈ అమ్మడింకా పెళ్లి చేసుకోలేదు. అయితే ఆ మధ్యన తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది మంజరి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్‌గా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అందులో ఎంతో బొద్దుగా షాకింగ్‌ లుక్‌లో కనిపించింది మంజరి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే