AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Save The Tigers: యాత్ర దర్శకుడి కామెడీ వెబ్‌ సిరీస్‌.. సేవ్‌ ది టైగర్స్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం యాత్ర. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మహి. వి. రాఘవ ఈ బయోపిక్‌ను అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు పాఠశాల, ఆనందో బ్రహ్మ లాంటి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో హిట్లు అందుకున్నారాయన.

Save The Tigers: యాత్ర దర్శకుడి కామెడీ వెబ్‌ సిరీస్‌.. సేవ్‌ ది టైగర్స్‌ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
Save The Tigers
Basha Shek
|

Updated on: Apr 25, 2023 | 9:28 PM

Share

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవిత కథతో మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందించిన చిత్రం యాత్ర. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ మహి. వి. రాఘవ ఈ బయోపిక్‌ను అద్భుతంగా తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు. అంతకు ముందు పాఠశాల, ఆనందో బ్రహ్మ లాంటి కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ సినిమాలతో హిట్లు అందుకున్నారాయన. ఇప్పుడు ఆయన ఓటీటీ బాట పట్టారు. సేవ్‌ ది టైగర్స్‌ పేరుతో ఓ సరికొత్త వెబ్‌ సిరీస్‌ను నిర్మించారు. అంతరించిపోతున్న పులులను, మొగుళ్లను కాపాడుకుందాం… అనేది ఈ సిరీస్‌ ఉప శీర్షిక. చిన్నా వాసుదేవ రెడ్డితో కలిసి మహి వి. రాఘవ ఈ కామెడీ సిరీస్‌ను రూపొందించారు. అలాగే ప్రదీప్ అద్వైతంతో కలిసి షో రన్నర్‌ గా వ్యవహరిస్తున్నారు. అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, ప్రియదర్శి, జోర్దార్‌ సుజాత, చైతన్య కృష్ణ, దేవయాని తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న సేవ్‌ ది టైగర్స్‌ డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌లో ఏప్రిల్‌ 27 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది.

యాత్ర 2 తప్పకుండా ఉంటుంది..

కాగా ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్లలో పాల్గొన్న మహి. వి. రాఘవ ‘యాత్ర 2’ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ జీవిత కథ ఆధారంగా యాత్ర సీక్వెల్‌ ఉంటుందని రాఘవ ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు అది సెట్స్ మీదకు వెళ్ళలేదు. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారాయన. ‘ యాత్ర2 సినిమా తప్పకుండా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ సీక్వెల్ గురించి ఎక్కువగా నేను మాట్లాడలేను. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన వాస్తవ సంఘటలను తీసుకుని సినిమా చేయాలి? నటీనటులుగా ఎవరిని తీసుకోవాలి? కంటెంట్ ఏం ఉండాలి? వంటి అంశాల గురించి నాకు క్లారిటీ వచ్చిన తర్వాత మరింత మాట్లాడతాను. అయితే, ఒక్కటి మాత్రం చెప్పగలను… ‘యాత్ర 2′, నేను చెప్పాలి అనుకున్న కథ! తప్పకుండా చెప్పి తీరుతా’ అని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రాఘవ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్