AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నితిన్‌ ‘చిన్నదాన నీకోసం’ హీరోయిన్‌ గుర్తుందా? పక్కింటమ్మాయిలా కవ్వించిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?

టాలీవుడ్ యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా 'తొలిప్రేమ' ఫేం కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ చిన్నదాన నీకోసం. ఇందులో బెంగాలీ అమ్మాయి మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించింది. పేరుకు కలకత్తా అమ్మాయ అయినా ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది మిస్త్రీ.

నితిన్‌ 'చిన్నదాన నీకోసం' హీరోయిన్‌ గుర్తుందా? పక్కింటమ్మాయిలా కవ్వించిన ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా?
Chinnadana Nee Kosam Movie
Basha Shek
|

Updated on: Apr 25, 2023 | 6:58 PM

Share

టాలీవుడ్ యూత్‌ స్టార్‌ నితిన్‌ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ చిన్నదాన నీకోసం. ఇందులో బెంగాలీ అమ్మాయి మిస్త్రీ చక్రవర్తి హీరోయిన్‌గా నటించింది. పేరుకు కలకత్తా అమ్మాయ అయినా ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపించింది మిస్త్రీ. తన అందం, అభినయంతో కుర్రకారును ఇట్టే కట్టిపడేసింది. సుమారు 9 ఏళ్ల క్రితం అంటే 2014లో విడుదలైన చిన్నదాన నీకోసం సినిమా యావరేజీగా నిలిచింది. అలాగే మిస్త్రీ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అవకాశాలు వచ్చి పడ్డాయి. తెలుగులో సుమంత్ అశ్విన్‌ సరసన కొలంబస్‌, శ్రీనివాస్‌ అవసరాల బాబూ బాగా బిజీ, శరభ, ఆది సాయికుమార్‌ బుర్రకథ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక హిందీలో కంగనా రనౌత్‌ మణికర్ణిక సినిమాలోనూ యాక్ట్‌ చేసింది. ఇలా జెట్‌ స్పీడ్‌తో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ 2019 తర్వాత మాత్రం సిల్వర్‌ స్ర్కీన్‌పై కనిపించలేదు. ఇదే సమయంలో వికో టర్మరిక్‌ వంటి యాడ్‌ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది.

కాగా సుమారు 4 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాతెరపై మెరవనుంది మిస్త్రీ. ఓ సాథియా పేరుతో తెరకెక్కుతోన్న ఓ తెలుగు సినిమాలో హీరోయిన్‌గా నటించనుందీ అందాల తార. ఆర్యన్‌ గౌర అనే కొత్త హీరో టాలీవుడ్‌ కు పరిచయం కానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. కాగా అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తోన్న మిస్త్రీ సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ గ్లామరస్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఆమె అందంలోనూ ఏ మాత్రం మార్పు కనిపించలేదు. పైగా మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..