AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ప్రస్థానం’ సినిమాలో శర్వానంద్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?

హీరోగా శర్వాకు మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా ప్రస్థానం. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమాలో మిత్రగా శర్వా అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ రూబీ పరిహార్. గర్ల్‌ఫ్రెండ్‌గా శర్వాను ఆటపట్టించే దివ్య పాత్రలో నటించి మెప్పించింది.

'ప్రస్థానం' సినిమాలో శర్వానంద్‌ గర్ల్‌ఫ్రెండ్‌ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో, ఏం చేస్తుందో తెలుసా?
Sharwanand, Ruby Parihar
Basha Shek
|

Updated on: Apr 26, 2023 | 8:18 PM

Share

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా టాలీవుడ్‌లో నిలదొక్కుకున్ హీరోల్లో శర్వానంద్‌ ఒకరు. కెరీర్‌ ప్రారంభంలో చిన్న చితకా సినిమాలు చేసిన ఈ ప్రామిసింగ్‌ హీరో ప్రస్తుతం హీరోగా సత్తాచాటుతున్నాడు. కాగా హీరోగా శర్వాకు మంచి బ్రేక్‌ ఇచ్చిన సినిమా ప్రస్థానం. దేవా కట్టా తెరకెక్కించిన ఈ సినిమాలో మిత్రగా శర్వా అభినయం అందరినీ ఆకట్టుకుంది. ఇదే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది బాలీవుడ్ బ్యూటీ రూబీ పరిహార్. గర్ల్‌ఫ్రెండ్‌గా శర్వానంద్ ను  ఆటపట్టించే దివ్య పాత్రలో నటించి మెప్పించింది. చూడడానికి హిందీ అమ్మాయే అయినా ప్రస్థానం సినిమాలో అచ్చమైన తెలుగమ్మయిలా కనిపించింది రూబి. అభినయంతోనూ ఆకట్టుకుందీ అమ్మడు. సినిమా కూడా సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాష సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది. ప్రస్థానం తర్వాత రాజేంద్ర, ప్రేమలో ఏబీసీ, కమీనా, యక్ష తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ సొగసరి. అయితే ఈ చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో క్రమంగా ఈ అమ్మడు ఫేడవుట్‌ హీరోయిన్ల లిస్టులో చేరింది. చివరగా తెలుగులో 2014లో ఇట్స్‌ మై లైఫ్‌ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది రూబి. అయితే ఈ సినిమా కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

ఆ మరుసటి ఏడాదే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రూబీ పరిహార్‌. ప్రముఖ దర్శకుడు క్రిష్‌, స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా సక్సెస్‌ అయ్యింది కానీ ఈ అమ్మడు పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్‌ లేకుండా పోయింది. దీంతో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లోనూ దారులు మూసుకుపోయాయి. సినిమా అవకాశాలు కరువవ్వడంతో రూబీ పరిహార్ మోడలింగ్ రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే నిత్యం తన గ్లామరస్‌ అండ్ హాట్‌ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తోంది. వీటిని చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. అప్పటికీ, ఇప్పటికీ రూబీ చాలా మారిపోయిదంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రూబీ పరిహార్ లేటెస్ట్ పోస్టులు:

View this post on Instagram

A post shared by Ruby Pari (@rubyparihar)

View this post on Instagram

A post shared by Ruby Pari (@rubyparihar)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..