Shaakuntalam: సినిమా ఇంతగా నిరాశ పరుస్తుందని అనుకోలేదు.. శాకుంతలం పై మధుబాల రియాక్షన్
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు.
స్టార్ హీరో సమంత నటించిన లేటెస్ట్ మూవీ శాకుంతలం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘గుణ టీం వర్క్స్’ ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ సినిమాను నిర్మించారు. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే అల్లు అర్జున్ గారాల కూతురు అల్లు అర్హ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. ఇక ఈ సినిమాలో సామ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది.ఇక ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు నటించారు.
వారిలో అలనాటి అందాల తార మధుబాల నటించారు. ఆమె శాకుంతలం సినిమాలో మేనకా పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా శాకుంతలం సినిమా రిజల్ట్ పై స్పందించారు మధుబాల. శాకుంతలం విజయం సాధించకపోవడం ఎంతగానో బాధపెట్టిందని అన్నారు మధుబాల.
సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. మా పై దర్శకుడు కూడా ఒత్తిడి పెట్టలేదు.. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వాలనుకున్నాడు. సీజీఐ వర్క్ కూడా బాగా జరిగింది కానీ సినిమా ఎందుకు ఆడలేదో అర్ధం కావడంలేదు. మా సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంతగా నిరాశ పరుస్తుందని మేం అనుకోలేదు అని చెప్పుకొచ్చారు మధుబాల.