Orange: మరోసారి రిలీజ్‌కు రెడీ అయిన రామ్ చరణ్ ఆరెంజ్.. అక్కడి ఫ్యాన్స్‌కు పూనకాలే

ది మోస్ట్ అండర్ రేటెడ్‌ టూ.. ది మోస్ట్ రేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన రామ్ చరణ్ సినిమాను తాజాగా జపాన్‌ లో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆరెంజ్‌ సినిమాను .. జపనీస్‌ కోసం.. అక్కడున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ కోసం భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

Orange: మరోసారి రిలీజ్‌కు రెడీ అయిన రామ్ చరణ్ ఆరెంజ్.. అక్కడి ఫ్యాన్స్‌కు పూనకాలే
Orange Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 27, 2023 | 9:36 AM

ఓ పక్క జపాన్‌లో ట్రిపుల్ ఆర్ తుఫాన్ కంటిన్యూ అవుతున్న టైంలోనే.. మరో హెచ్చరిక జారీ చేశారు తెలుగు మేకర్స్. ది మోస్ట్ అండర్ రేటెడ్‌ టూ.. ది మోస్ట్ రేటెడ్ ఫిల్మ్‌గా నామ్ కమాయించిన రామ్ చరణ్ సినిమాను తాజాగా జపాన్‌ లో రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆరెంజ్‌ సినిమాను .. జపనీస్‌ కోసం.. అక్కడున్న రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్ కోసం భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

రీసెంట్‌గా రీ రిలీజ్ అయి.. సూపర్ డూపర్ హిట్టైన చెర్రీ ఆరెంజ్‌ మూవీని జపాన్‌లో మే6న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారట మేకర్స్. ట్రిపుల్ ఆర్ కారణంగా.. రామ్ చరణ్ కు వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా ను అక్కడ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అవ్వడమే కాదు.. ఇప్పటికే ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా చకా చకా చేస్తున్నారు మేకర్స్.

ఇక మగధీర సినిమా తరువాత.. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రామ్ చరణ్‌ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఆరెంజ్ సినిమా అప్పట్లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తరువాత మాత్రం అందరి చేత అప్లాజ్ అందుకుంది. ఇక రీసెంట్ గా రీ రిలీజ్ అయి కోట్లలో వసూళ్లు రాబట్టి.. ఆరెంజ్ 2 రావాలనే డిమాండ్‌ను తెరపైకి వచ్చేలా చేసింది.