Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ నన్ను కలవలేదు.. ఫోన్ నెంబర్ ఇవ్వలేదు.. అదంతా అబద్దమే
హైదరాబాద్ లోని క్రేబుల్ బ్రిడ్జ్ దగ్గర బైక్ పై వెళ్తుండగా తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజులు కోమాలో ఉన్న తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు తేజ్.. అయితే ప్రమాద సమయంలో అక్కడే ఉన్న వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేసి సమాచారం అందించడంతో పాటు.. పడిపోయిన తేజ్ ను లేపి.. నీళ్లు తాగించడం చేశాడు.
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని క్రేబుల్ బ్రిడ్జ్ దగ్గర బైక్ పై వెళ్తుండగా తేజ్ ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. కొద్దిరోజులు కోమాలో ఉన్న తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు తేజ్.. అయితే ప్రమాద సమయంలో అక్కడే ఉన్న వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేసి సమాచారం అందించడంతో పాటు.. పడిపోయిన తేజ్ ను లేపి.. నీళ్లు తాగించడం చేశాడు. అప్పుడు అతని యాక్సిడెంట్ అయ్యింది హీరో సాయి ధరమ్ తేజ్ కు అని కూడా తెలియదట మానవత్వంతో తేజ్ ను కాపాడాడు. అతడి పేరు అబ్దుల్. అయితే ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అద్బుల్ కు సాయి ధరమ్ తేజ్ కలిశాడని.. అతనికి ఎలాంటి సాయం కావాలన్నా చేసేస్తా అన్నారని తన ఫోన్ నెంబర్ కూడా అద్బుల్ కు ఇచ్చారని ప్రచారం జరిగింది.
అయితే తనకు తేజ్ ఎలాంటి సాయం చేయలేదని.. కనీసం కలవలేదని అంటున్నాడు అద్బుల్. అసత్య ప్రచారం కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నానని.. టార్చర్ పెరిగిందని అంటున్నాడు. ఇటీవల సాయి ధరమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తికి ఎలాంటి రివార్డ్ ఇవ్వలేదు. ఒక లక్షరూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం తనకు నచ్చదు అన్నారు.
కానీ ఏ సాయం కావాలన్న నేను చేస్తానని, నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చానని అన్నారు తేజు. ఇదిలా ఉంటే.. ఇదంతా అబద్దం అంటున్నాడు అద్బుల్, ఇప్పటివరకు తనను తేజ్ కలవలేదు అని.. సాయి ధరమ్ తేజ్ కానీ మెగా ఫ్యామిలీ కానీ తనకు ఎలాంటి సాయం చేయలేదని అంటున్నారు అబ్దుల్. ఈ సత్య ప్రచారాలు కారణంగా ఇబ్బందిపడుతునని.. ఉద్యోగం కూడా మానేశా అని చెప్పుకొచ్చాడు. మొదట్లో ఒక షాప్ లో పని చేసే వాడిని.. కానీ మెగా ఫ్యామిలీ నాకు డబ్బులు, బిల్డింగ్ , కారు ఇచ్చారంటూ ప్రచారం జరగడంతో.. అందరు బాగానే డబ్బు సంపాదించావ్ అంటూ వేధించారని తట్టుకోలేక చివరకు జాబ్ మానేశా అని అంటున్నాడు అబ్దుల్.. ప్రస్తుతం నాలుగు నెలల నుంచి ఖాళీగా ఉంటున్నా అని ఆవేదన వ్యక్తం చేశాడు.