AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vimanam: ఫ్లైట్‌ జర్నీ చేసిన వారికి ‘విమానం’ టీమ్‌ బంపరాఫర్‌.. బోలెడు బహుమతులు గెల్చుకునే ఛాన్స్‌.. ఎలాగంటే?

పలు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన సముద్రఖని నటిస్తోన్న తాజా చిత్రం విమానం. శివప్రసాద్ యానాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయ, మీరా జాస్మిన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో రిలీజ్‌ కానుంది.

Vimanam: ఫ్లైట్‌ జర్నీ చేసిన వారికి 'విమానం' టీమ్‌ బంపరాఫర్‌.. బోలెడు బహుమతులు గెల్చుకునే ఛాన్స్‌.. ఎలాగంటే?
Vimanam Movie
Basha Shek
|

Updated on: Apr 26, 2023 | 8:52 PM

Share

సముద్రఖని.. ప్రస్తుతం నటుడిగా, డైరెక్టర్‌గా సత్తా చాటుతున్న ఈ మల్టీ ట్యాలెంటెడ్‌ పర్సన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓవైపు పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ హీరోలుగా వినోదయ సీతమ్‌ రీమేక్‌ను తెరకెక్కిస్తోన్న సముద్ర ఖని మరోవైపు నటుడిగానూ బిజీగా మారుతున్నారు. పలు సినిమాల్లో విలన్‌గా మెప్పించిన సముద్రఖని నటిస్తోన్న తాజా చిత్రం విమానం. శివప్రసాద్ యానాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అనసూయ, మీరా జాస్మిన్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించేలా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో ఏకకాలంలో రిలీజ్‌ కానుంది. జీ స్టూడియోస్, కిరణ్​ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్​ ఆధ్వర్యంలో రూపొందిన ఈ సినిమా జూన్ 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్‌ కార్యక్రమాలను షురూ చేసింది విమానం మూవీ యూనిట్‌. ఇందులో భాగంగా ప్రేక్షకులకు ఓ బంపరాఫర్‌ ప్రకటించింది. అదేంటంటే ఎప్పుడైనా విమానంలో ప్రయాణించిన వారు ఆ అనుభవాలు, అనుభూతులను తమతో పంచుకోవాలని సినిమా యూనిట్‌​ కోరింది.

ఇందుకోసం ఫ్లైట్‌ జర్నీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను #MyFirstVimanamకు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరింది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేవారికి బోలెడు బహుమతులు అందజేస్తామని విమానం మూవీ మేకర్స్‌ ప్రకటించారు. సో.. మరి మీరెప్పుడైనా విమానంలో ప్రయాణం చేశారా? ఒకవేళ చేసిఉంటే మీ అనుభవాలను విమానం మూవీ టీమ్‌తో షేర్‌ చేసుకోండి. అద్భుతమైన బహుమతులు గెల్చుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!