Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మన హీరోల బాండింగ్‌ అలాంటిది మరి.. బాలయ్య కోసం తన ఇంటిని ఇచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఎందుకో తెలుసా?

గతంలో బాక్సాఫీస్‌ వద్ద చాలా సార్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు బాలయ్య, చిరంజీవి. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పై చేయి సాధిస్తే, మరికొన్నిసార్లు బాలయ్య సత్తా చాటేవారు. ఇంకొన్నిసార్లు ఇద్దరూ హిట్లు కొట్టేవారు. ఈ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కాంపిటీషన్‌ సినిమాల వరకే..

మన హీరోల బాండింగ్‌ అలాంటిది మరి.. బాలయ్య కోసం తన ఇంటిని ఇచ్చేసిన మెగాస్టార్‌ చిరంజీవి.. ఎందుకో తెలుసా?
Balakrishna, Chiranjeevi
Follow us
Basha Shek

|

Updated on: Apr 27, 2023 | 12:55 PM

మెగాస్టార్‌ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ.. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఇద్దరు టాప్‌ హీరోలు. వీరిద్దరికి జనాల్లో విపరీతమైన మాస్‌ ఫాలోయింగ్‌ ఉంది. గతంలో బాక్సాఫీస్‌ వద్ద చాలా సార్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు బాలయ్య, చిరంజీవి. కొన్ని సందర్భాల్లో చిరంజీవి పై చేయి సాధిస్తే, మరికొన్నిసార్లు బాలయ్య సత్తా చాటేవారు. ఇంకొన్నిసార్లు ఇద్దరూ హిట్లు కొట్టేవారు. ఈ పోటీ ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ కాంపిటీషన్‌ సినిమాల వరకే.. ఆఫ్‌ స్ర్కీన్‌లో బాలయ్య, చిరంజీవి ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటారు. కానీ అభిమానులకు ఈ విషయం అర్థం కావడం లేదు. అందుకే ‘మా హీరో గ్రేట్‌’ అంటూ నిత్యం నెట్టింట ఘర్షణలు పడుతున్నారు ఫ్యాన్స్‌. ఇదిలా ఉంటే బాలయ్య, చిరంజీవిల మధ్య మంచి అనుబంధం ఉందనడానికి చాలా సంఘటనలను ఉదాహరణలుగా పేర్కొనవచ్చు. ఈక్రమంలో బాలయ్య సినిమా షూటింగ్‌ కోసం ఒకసారి చిరంజీవి తన గెస్ట్‌ హౌస్‌ను వాడుకోమని వచ్చారట. వివరాల్లోకి వెళితే.. బాలయ్య నటించిన సూపర్‌ హిట్ చిత్రాల్లో నారీ నారీ నడుమ మురారి ఒకటి. బాలకృష్ణ కెరీర్‌లో 50వ మూవీగా ఇది తెరకెక్కింది. అందుకు తగ్గట్లే ఆయన కెరీర్‌లో ఎవర్‌ గ్రీన్‌ మూవీగా నిలిచింది. అయితే నారీ నారీ నడుమ మురారి సినిమా షూటింగ్‌ దాదాపు చాలా వరకు చిరంజీవి గెస్ట్‌ హౌస్‌ లోనే జరిగిందట.

1989 డిసెంబర్ 3న నారీ నారీ నడుమ మురారి సినిమా షూటింగ్ ప్రారంభమైంది. మెగాస్టార్‌కు ఎన్నో హిట్‌ సినిమాలు అందించిన కోదండరామిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 90 శాతం షూటింగ్ చెన్నైలోని వెల్లిచ్చెరి ఏరియాలో ఉన్న చిరంజీవి గెస్ట్ హౌస్ లోనే జరిగిందట. హనీ హౌస్ అనే పేరిట ఉన్న ఈ ఇల్లు చిరంజీవికి ఎంతో ఇష్టమట. ఈ గెస్ట్‌ హౌస్ పక్కనే రెండెకరాల భూమి కూడా చిరంజీవి పేరు మీదనే ఉందట. కాగా బాలయ్య కెరీర్‌లో నారీనారీ నడుమ మురారి సినిమా ఓ మైలురాయిలా నిలిచిపోవడం, ఆ సినిమా షూటింగ్‌ మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో జరగడం విశేషమనే చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి
Nari Nari Naduma Murari

Nari Nari Naduma Murari

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.