Akhil Akkineni: అయ్యగారు అదిరిపోయే ప్లాన్.. బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్స్ట్ సినిమా
8 ఏళ్లలో ఆయన చేసిన సినిమాలు 4 మాత్రమే.. ఇప్పుడు ఐదో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్నుతో ఫ్లాపులు ఇచ్చిన ఈయన.. కాస్త గ్యాప్ తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో సోసో హిట్ కొట్టారు. ప్రస్తుతం ఏజెంట్‌తో వస్తున్నారు అఖిల్. ఎప్రిల్ 28న విడుదల కానుంది ఈ చిత్రం.
ఏజెంట్ తర్వాత అఖిల్ ఏం చేయబోతున్నారు..? ఏ దర్శకుడితో సినిమా ఉండే ఛాన్స్ ఉంది..? ఒక్కో సినిమాకు రెండు మూడేళ్ళ టైమ్ తీసుకుంటున్న అక్కినేని వారసుడు.. ఏజెంట్ తర్వాత కూడా అదే చేయాలనుకుంటున్నారా..? లేదంటే వెంటనే మరో సినిమాకు ప్లాన్ చేస్తున్నారా..? అదే చేస్తే ఏ దర్శకుడు రేసులో ఉన్నారు..? బ్లాక్‌బస్టర్ డైరెక్టర్‌తోనే అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ రెడీ అవుతుందా..? కారణం తెలియదు కానీ అఖిల్ కెరీర్ మాత్రం చాలా నెమ్మదిగా సాగుతుంది. 8 ఏళ్లలో ఆయన చేసిన సినిమాలు 4 మాత్రమే.. ఇప్పుడు ఐదో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్నుతో ఫ్లాపులు ఇచ్చిన ఈయన.. కాస్త గ్యాప్ తీసుకుని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో సోసో హిట్ కొట్టారు. ప్రస్తుతం ఏజెంట్‌తో వస్తున్నారు అఖిల్. ఎప్రిల్ 28న విడుదల కానుంది ఈ చిత్రం.
సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఏజెంట్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీని తర్వాత తన మార్కెట్ కూడా పెరుగుతుందని నమ్ముతున్నారు అఖిల్. అందుకే ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు అక్కినేని వారసుడు. అయితే ఏజెంట్ తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో పని చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి ఇద్దరు ముగ్గురు దర్శకుల పేర్లు వినిపించినా.. శ్రీకాంత్ ఓదెల ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
దసరా సినిమాతో టాలీవుడ్‌కు సెన్సేషనల్ డెబ్యూ చేసారు శ్రీకాంత్ ఓదెల. మొదటి సినిమాతోనే 100కోట్ల విజయం అందుకున్నారు. రెండో సినిమా కోసం అఖిల్‌ను లైన్‌లో పెడుతున్నట్లు తెలుస్తుంది. ఓ భారీ నిర్మాణ సంస్థ.. ఈ కాంబినేషన్‌లో పాన్ ఇండియన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఏజెంట్ రిలీజ్ తర్వాత శ్రీకాంత్, అఖిల్ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశముంది. మరి చూడాలిక.. నానితో చేసిన మ్యాజిక్.. అఖిల్‌తోనూ శ్రీకాంత్ రిపీట్ చేస్తారేమో..?