Throwback: అమ్మతో కలిసి అమాయకంగా నవ్వులు చిందిస్తోన్న ఈ బుజ్జాయి ఎవరో తెలుసా..? క్రేజీ హీరోయిన్ ఆమె
ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కనిపెట్టారా..? అమ్మ ఎత్తుకుంటే అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.? ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్న వయసులో ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కనిపెట్టారా..? అమ్మ ఎత్తుకుంటే అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా.? ఒకప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిన ఆ చిన్నారి ఎవరో కాదు..? ఆమె నవ్వులో ఓ మ్యాజిక్ ఉంటుంది.. ఆమె మొఖంలో ఓ వెలుగుంటుంది.. ఇంతకు ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?
పై ఫొటోలో ఉన్న చిన్నది మరెవరో కాదు. అందాల హాసిని జెనీలియా.. బాయ్స్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైనా ఈ చిన్నది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్ లభించింది. తెలుగులో చేసిన బొమ్మరిల్లు సినిమా జెనీలియాకు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.
వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’’ అంటూ బొమ్మరిల్లు మూవీలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. 2012లో నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన అనంతరం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది జెనీలియా. మధ్యలో నాలుగు చిత్రాల్లో గెస్ట్ రోల్స్‌కే పరిమితమైన ఈ అల్లరి పిల్ల.. పదేళ్ల అనంతరం ఇటీవలే ఓ మరాఠి సినిమాలో నటించింది.
View this post on Instagram