తండ్రి నాస్తికుడు.. తనయకి దైవ భక్తి.. కష్టాల నుంచి కాపాడుతుందని కుమారస్వామి ఆయుధాన్ని టాటూ వేయించుకున్న నటి..

తనకు దైవం  మీద ఉన్న భక్తిని, విశ్వాసాన్ని తెలియజేస్తూ.. శృతి హాసన్ తన వీపు పై మురుగన్ ఆయుధమైన వేలాయుధాన్ని టాటూగా వేసుకుంది. ఈ గుర్తుతో పాటు శృతి అనే పేరు తమిళంలో ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. 

తండ్రి నాస్తికుడు.. తనయకి దైవ భక్తి.. కష్టాల నుంచి కాపాడుతుందని కుమారస్వామి ఆయుధాన్ని టాటూ వేయించుకున్న నటి..
Shruti Hassan
Follow us
Surya Kala

|

Updated on: Apr 27, 2023 | 1:26 PM

విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల తనయ శృతి హాసన్ తాజాగా ఓ టాటూ తో వార్తల్లో నిలిచింది. తండ్రి వారసురాలిగా వెండి తెరపై అడుగు పెట్టిన శృతి హాసన్.. మల్టీటాలెంటెడ్ పర్సన్. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది శృతి. అయితే శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్ పక్కా నాస్తికుడు అన్న సంగతి తెలిసిందే. తాను మాత్రం దైవాన్ని నమ్ముతానని చెప్పింది శృతి. తన ఇంట్లో పూజ గది ఉందని.. తనకు దైవ భక్తి ఎక్కువ అని అయితే దేవుడిని దర్శించడానికి ఎక్కువగా గుళ్లకు వెళ్ళాను అని తెలిపింది. మనిషి మనిషే ఒక దేవాలయం అంటూ శృతి తెలిపింది.

మరోసారి తనకు దైవం  మీద ఉన్న భక్తిని, విశ్వాసాన్ని తెలియజేస్తూ.. శృతి హాసన్ తన వీపు పై మురుగన్ ఆయుధమైన వేలాయుధాన్ని టాటూగా వేసుకుంది. ఈ గుర్తుతో పాటు శృతి అనే పేరు తమిళంలో ఉంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

శృతి తన కొత్త పచ్చబొట్టు స్టోరీని ఇన్‌స్టాగ్రామ్ లో పంచుకుంది. తాను ఎప్పుడూ ఆధ్యాత్మికంవైపు మొగ్గు చూపుతానని తన హృదయంలో మురుగన్ వేల్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ టాటూ ద్వారా తనకు కుమారస్వామిపై ఉన్న భక్తిని ప్రదర్శించాలనుకుంటున్నాను” అని చెప్పింది. ఇది కష్టాల నుండి మనిషిని  కాపాడుతుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి శృతి హాసన్ శరీరంపై ఐదు టాటూలున్నాయి. వాటిలో ఒకటి తమిళంలో వ్రాసిన ఆమె పేరు. ఆమె చెవి వెనుక ఒక సంగీతానికి సంబంధించిన జి-క్లెఫ్ గుర్తు,  ఆమె మణికట్టు మీద గులాబీ. గత వారం శృతి హాసన్ మళ్లీ టాటూ వేయించుకుంది. ఈసారి కుమారస్వామికి ఆయుధాన్ని వేయించుకుంది. శృతి శరీరం మీద ఉన్న ప్రతి పచ్చబొట్టు ప్రత్యేక అర్ధాన్ని కలిగి ఉంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు