Galwan Ghati Vivad: భారత సైన్య ధైర్యసాహసాలు వెండి తెరపై ఆవిష్కరణ.. త్వరలో  గాల్వన్ సంఘటనపై సినిమా 

2020లో గాల్వన్ వివాదంలో భారత సైన్యం, చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఇది రెండు దేశాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటనపై దర్శకుడు అపూర్వ లఖియా సినిమా తీయబోతున్నాడు. ఇందులో భారత ఆర్మీ పరాక్రమాన్ని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు.

Galwan Ghati Vivad: భారత సైన్య ధైర్యసాహసాలు వెండి తెరపై ఆవిష్కరణ.. త్వరలో  గాల్వన్ సంఘటనపై సినిమా 
Galwan Ghati Vivad
Follow us

|

Updated on: Apr 25, 2023 | 1:18 PM

భారత్, చైనాల మధ్య తూర్పు లడఖ్ సరిహద్దులో ఎప్పుడూ ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. ఇక్కడి సరిహద్దు విషయంలో గత 5 దశాబ్దాలుగా భారత్, చైనాల మధ్య వివాదం నడుస్తోంది. 2020లో గాల్వన్ వివాదంలో భారత సైన్యం, చైనా సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఇది రెండు దేశాల రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఇప్పుడు ఈ ఘటనపై దర్శకుడు అపూర్వ లఖియా సినిమా తీయబోతున్నాడు. ఇందులో భారత ఆర్మీ పరాక్రమాన్ని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు.

దర్శకుడు అపూర్వ లఖియా గతంలో ఏక్ అజ్ఞాతవాసి, షూటౌట్ ఎట్ లో ఖండ్‌వాలా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు అపూర్వ లఖియా భారత ఆర్మీ పరాక్రమాన్ని వెండి తెరపై చూపించడానికి సన్నాహాలు పూర్తి చేసింది. ఈ సినిమా గురించి ప్రకటన చేస్తూ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

గాల్వన్ వ్యాలీలో చైనా, భారత సైన్యం మధ్య జరిగిన వాగ్వివాదంపై రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ 3’ పుస్తకం నుండి ఈ సినిమా కథ తీసుకున్నారు. ఈ పుస్తకంలో, 2020 సంవత్సరంలో గాల్వాన్ ప్రాంతంలో జరిగిన హింస గురించి వెల్లడించారు. ఈ పుస్తకాన్ని జర్నలిస్టులు శివ అరూర్ , రాహుల్ సింగ్ రాశారు. భారత సైన్యం, చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణను తెలియజేస్తూ ఈ పుస్తకం వ్రాశారు.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

ఈ చిత్రానికి కథ , స్క్రీన్‌ప్లే లను సురేష్ నాయర్ అందిస్తున్నారు. చింతన్ గాంధీ దీనికి సహ రచయితగా వ్యవహరించారు. ఈ సినిమా మాటలను చింతన్ షా అందిస్తున్నారు. ఈ చిత్రంలో నటించే తారాగణం,  ప్రధాన పాత్రకు సంబంధించిన పేర్లను వెల్లడించాల్సి ఉంది.

అయితే గాల్వన్ వ్యాలీ వివాదంపై సినిమా తెరకెక్కించడం గురించి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ మాట్లాడారు. అంతేకాదు గతంలో కూడా భారత ఆర్మీ పరాక్రమాన్ని తెలియజేసే విధంగా వెండి తెరపై అనేక సినిమాలు వచ్చాయి. భారత యుద్ధ వీరులు, భారతీయ సర్జికల్ స్ట్రైక్‌, భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధ కథలను తెరపై ఆవిష్కరించారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.