AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: క్యాన్సర్‌పై తన పోరాటం స్ఫూర్తిదాయకమని అనుకోలేదంటున్న సోనాలి.. అది వారి గొప్పదనమే..

సోనాలి ఇంకా మాట్లాడుతూ.. “తాను ప్రజలకు స్ఫూర్తిగా మారాలని అనుకోనని.. అయితే తాను ఎవరికైనా ప్రేరణ ఇస్తుందంటే..  అది వారి గొప్పతనం అని చెప్పారు. దీనికి తాను వినయంగా ఉండాలని.. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా అలాంటివే నని చెప్పారు.

Sonali Bendre: క్యాన్సర్‌పై తన పోరాటం స్ఫూర్తిదాయకమని అనుకోలేదంటున్న సోనాలి.. అది వారి గొప్పదనమే..
Sonali Bindre
Surya Kala
|

Updated on: Apr 06, 2023 | 3:05 PM

Share

ప్రముఖ నటి, మోడల్ సోనాలి బింద్రే క్యాన్సర్ ను జయించి మళ్ళీ బుల్లితెరపై అడుగు పెట్టింది. ప్రముఖ సోనీ టీవీ ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 3కి జడ్జిగా సోనాలి బింద్రే అడుగు పెట్టింది. ఈ సందర్భంగా సోనాలి తాను క్యాన్సర్ పై పోరాడిన విధానం గురించి మాట్లాడింది. సోనాలి బింద్రే 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్‌ను ఎదుర్కోవలసి వచ్చింది. చికిత్స తీసుకున్న ఆమె క్యాన్సర్ ను జయించి  బయటపడింది. తాను క్యాన్సర్ చికిత్స తీసుకునే సమయంలో కోలుకోవడానికి కారణం సోనాలి సంకల్ప బలమే అని చెప్పవచ్చు.

అయితే సోనాలి తన పోరాటం స్ఫూర్తిదాయకమని తాను నమ్మడం లేదని చెప్పింది. అంతేకాదు తాను ఎప్పుడూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తుస్తూనే ఉన్నానని.. అయితే అనారోగ్యం తర్వాత కూడా తన జీవనశైలిలో ఎక్కువ మార్పులు రాకపోవడానికి కారణం ఇదే అని చెప్పారు. అంతేకాదు జీవితంపై ఖచ్చితంగా అవగాహన వచ్చింది.

ఇంకా సోనాలి ఏమన్నారంటే.. ?  సోనాలి ఇంకా మాట్లాడుతూ.. “తాను ప్రజలకు స్ఫూర్తిగా మారాలని అనుకోనని.. అయితే తాను ఎవరికైనా ప్రేరణ ఇస్తుందంటే..  అది వారి గొప్పతనం అని చెప్పారు. దీనికి తాను వినయంగా ఉండాలని.. పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే ఇబ్బందులు కూడా అలాంటివే నని చెప్పారు. పిల్లలకు జీవితంపై నమ్మకం.. భవిష్యత్ పై ఆశను కల్పించడం  స్ఫూర్తి దాయకంగా ఉంటుందని మీరు షోలో చూస్తారని చెప్పింది సోనాలి.

ఇవి కూడా చదవండి

ఇంకా సోనాలి మాట్లాడుతూ, “షోలో చూసిన చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టాల ముందు తన అనారోగ్యం పెద్ద విషయం అనిపించడం లేదని అన్నారు. మనం నిరాడంబరంగా ఉండాలని ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల కథలు మనకు గ్రహిస్తాయి. తనకు గొప్ప మద్దతు ఇచ్చేవారున్నారు.  అత్యుత్తమ చికిత్సను భరించగలిగే శక్తి ఉంది. నన్ను నేను ధన్యుడిగా భావిస్తానని పేర్కొంది సోనాలి.

ప్రజల నుండి ప్రేరణ పొందిన సోనాలి  భారతదేశపు బెస్ట్ డ్యాన్సర్ గా సోనాలి అభిమానుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇదే విషయంపై సోనాలి మాట్లాడుతూ.. తనని అభిమానించిన ఫ్యాన్స్ కు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని.. ప్రజలు తన నుండి ప్రేరణ పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పారు. ఐయితే తనకు మాత్రం ప్రేరణ లేదా స్ఫూర్తి.. రోజు జీవితంలో పోరాడే వ్యక్తుల నుంచి ప్రతి రోజూ  ప్రేరణ పొందుతానని పేర్కొన్నారు.

సోనీ టీవీ డ్యాన్స్ రియాలిటీ షోకి సోనాలి బింద్రే తొలిసారిగా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే సోనాలి అంతకుముందు చిన్నారుల  డ్యాన్స్ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతలగా వ్యవహరించారు. అయితే ఈసారి ఆమె 18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న కంటెస్టెంట్స్‌కు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సోనీ టీవీలో ప్రసారం కానున్న ఈ షో ఏప్రిల్ 8 నుంచి ప్రారంభం కానుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..