Kacha Badam: బుల్లితెరపై సందడి చేయనున్న కచ్చా బాదాం సింగర్.. సీరియల్‌లో ఓ తండ్రి పాత్రతో అడుగు..

ఓ బెంగాలీ సీరియల్‌లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఈ సీరియల్ లో తన కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించే అమ్మాయి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తైందట.

Kacha Badam: బుల్లితెరపై సందడి చేయనున్న కచ్చా బాదాం సింగర్.. సీరియల్‌లో ఓ తండ్రి పాత్రతో అడుగు..
Kacha Badam Singer
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2023 | 4:51 PM

సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి వచ్చిన తర్వాత.. చాలా మంది ఓవర్ నైట్ ఫేమస్ అయిపోతున్నారు. అయితే ఇలా ఒక్క రోజులో వచ్చే స్టార్‌డమ్‌ ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. కొందరు తమకి వచ్చిన ఫేమ్ ని వినియోగించుకుని భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ” కచ్చా బాదం” సింగర్‌ భూబన్‌ బద్యాకర్‌ బుల్లి తెరపై అడుగు పెట్టనున్నాడు. ఒక టీవీ సీరియల్ లో  నటుడుగా అవకాశం అందుకుని సింగర్ యాక్టర్ గా మారి అరంగేట్రం చేస్తున్నాడు.

ఓ బెంగాలీ సీరియల్‌లో తండ్రి పాత్రకు ఓకే చెప్పాడు. ఈ సీరియల్ లో తన కూతురు ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించే అమ్మాయి తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ కూడా పూర్తైందట. భూబన్‌ బద్యాకర్‌ ఈ పాత్రలో నటించినందునుకు రూ. 40,000 అందుకున్నాడు.  మంచి పాత్రాలు వస్తే.. భవిష్యత్తులో నటిస్తానని చెప్పాడు. గతంలో కూడా పలు రియాల్టీ షోలలో కూడా కనిపించాడు.

భూబన్‌ కచ్చా బాదమ్‌ పాట పాడుతూ పల్లీలు అమ్ముకునేవాడు. ఆ పాట సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో హల్ హల్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యాడు. కారు కూడా కొనుక్కున్నాడు. డ్రైవింగ్ నేర్చుకుంటూ యాక్సిడెంట్ అయి ఆస్పత్రిలో చేరాడు. అడిగిన వారికీ లేదంటూ అప్పులు ఇచ్చుకుంటూ వెళ్లి.. ఇప్పుడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్లి జీవిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం భూబన్‌  దుబ్రాజ్‌పూర్‌లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. ప్రతినెలా అద్దెకు చాలా డబ్బు ఖర్చు అవుతోంది, అయితే పెద్దగా ఆదాయం లేదు. “కచ్చ బాదం” పాట నాకు పేరు తెచ్చిపెట్టింది. అయితే కాపీరైట్ సమస్యల కారణంగా భూబన్‌ ఆ  పాటను పాడలేడు లేదా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయలేడు ” ఈ విషయాన్నీ చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్  వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..