AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Property: సల్మాన్ ఖాన్ ఆస్తులు విలువ ఏకంగా 2800 కోట్లు.. మరి ఆయన తమ్ముళ్ల ఆస్తులు విలువ ఎంతో తెల్సా

కండల వీరు.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ విషయం ఆయన అభిమానులకే కాదు అందరికీ తెలిసిందే. అయితే.. సల్మాన్ సోదరులు-నటులు అర్బాజ్ ఖాన్..  సోహైల్ ఖాన్ ఇద్దరూ కూడా అన్నకు తగ్గ తమ్ముళ్లేనని.. వీరి ఆస్తుల విలువ అందరికంటే ఏమీ తక్కువ కాదని మీకు తెలుసా.

Salman Property: సల్మాన్ ఖాన్ ఆస్తులు విలువ ఏకంగా 2800 కోట్లు.. మరి ఆయన తమ్ముళ్ల ఆస్తులు విలువ ఎంతో తెల్సా
Salman Khan Brothers Properties
Surya Kala
|

Updated on: Apr 10, 2023 | 10:54 AM

Share

తండ్రికి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన సల్మాన్ ఖాన్.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో అయ్యాడు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలతో అలరించాడు ఈ కండల వీరు.. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో సల్మాన్ ఖాన్ ఒకరు. ఈ విషయం ఆయన అభిమానులకే కాదు అందరికీ తెలిసిందే. అయితే.. సల్మాన్ సోదరులు-నటులు అర్బాజ్ ఖాన్..  సోహైల్ ఖాన్ ఇద్దరూ కూడా అన్నకు తగ్గ తమ్ముళ్లేనని.. వీరి ఆస్తుల విలువ అందరికంటే ఏమీ తక్కువ కాదని మీకు తెలుసా. ఈ ఇద్దరు స్టార్ల నికర విలువ ఆస్తుల విలువ తెలిస్తే.. షాక్ తిండడం ఖాయం.. మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన భాయిజాన్ సల్మాన్ ఖాన్ ముంబైలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లి తెరపై హోస్ట్ గా అలరిస్తున్న సల్మాన్ ఖాన్ ఆస్తి విలువ సుమారు 2800 కోట్లు. నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ నెల వారీ సంపాదన 16 కోట్లు. మరోవైపు.. సల్లు భాయ్ సోదరుల సంపాదన.. ఆస్తుల విలువ తెలిస్తే మీరు షాక్ అవుతారు.

నివేదికల ప్రకారం సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్  ఒక చిత్రానికి 10 నుండి 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడని తెలుస్తోంది.  అర్బాజ్ ఖాన్ నికర ఆస్తుల విలువ 82 మిలియన్లు. 2023 సంవత్సరపు నివేదిక ప్రకారం అర్బాజ్ కూడా అతని అన్నయ్య సల్మాన్ లా  కొన్ని వందల కోట్లకు యజమాని. అర్భాజ్ ఖాన్ నటుడు మాత్రమే కాదు..  నిర్మాత కూడా. తన కెరీర్‌లో నాలుగు సినిమాలు నిర్మించాడు. మై దబాంగ్  2, దబాంగ్ 3, డాలీ కి డోలీ, ఫియర్‌లెస్ సినిమాలను నిర్మించాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తన అన్న సల్మాన్ లా సినీ కెరీర్ లో సూపర్ హిట్స్ అందుకోకపోయినా తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భారీగానే సంపాదిస్తున్నాడు. సోహైల్ ఖాన్ కూడా భారీగానే ఆస్తులను కూడబెట్టినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. 2023 సంవత్సరంలో వెల్లడైన నివేదికల ప్రకారం  సోహైల్ ఖాన్ ఆస్తుల నికర విలువ 1.3 బిలియన్ల.. అంటే మన  దేశ కరెన్స్ లో 108 కోట్లకు యజమాని సోహైల్. ఈ ఆస్తుల విలువ సాధారణ నటుడి నికర విలువ కంటే ఎక్కువే. సోహైల్ 1981 చిత్రం లాపర్వాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు సినిమాల్లో చాలా అరుదుగా కనిపిస్తున్నాడు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..