AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరమ చెత్త సినిమా.! రూ. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. థియేటర్లలో 20 టికెట్లు కూడా తెగలేదు

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. ఆమె హిందీలో క్వీన్, మణికర్ణిక లాంటి విజయవంతమైన చిత్రాలతో..

పరమ చెత్త సినిమా.! రూ. 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే.. థియేటర్లలో 20 టికెట్లు కూడా తెగలేదు
Trending
Ravi Kiran
|

Updated on: Feb 25, 2026 | 1:39 PM

Share

కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం భారీ బడ్జెట్‌తో విడుదలై తీవ్ర పరాజయం పాలైంది. వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం కేవలం రూ. 3.3 కోట్లు మాత్రమే వసూలు చేసింది. కోవిడ్ సమయంలో విడుదలైన ఈ చిత్రం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ధాకడ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్ర పరాజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ తెలుగులో ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించారు. ఆమె హిందీలో క్వీన్, మణికర్ణిక లాంటి విజయవంతమైన చిత్రాలతో పాటు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలలో కూడా నటించారు. అయితే, దర్శకుడు రజనీష్ ఘై రూపొందించిన ధాకడ్ చిత్రానికి ప్రేక్షకాదరణ లభించలేదు.

ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో సుమారు రూ. 90 నుంచి రూ. 100 కోట్లతో నిర్మించారు. కానీ, విడుదలైన మొదటి మూడు రోజుల్లో కేవలం రూ. 3 కోట్ల 30 లక్షల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. అప్పట్లో చాలా థియేటర్లలో.. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో, 20 నుంచి 30 మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారని టాక్. దీంతో అనేక ప్రాంతాలలో ఈ చిత్రాన్ని థియేటర్ల నుంచి తొలగించారు. కోవిడ్ సమయంలో ఈ సినిమా రిలీజ్ కావడంతో.. ఆ సమయంలో సినీ వ్యవస్థే మారిపోవడంతో.. ప్రేక్షకులు ఎంత పెద్ద హీరో లేదా హీరోయిన్ ఉన్నా, సినిమాలో బలమైన కంటెంట్ లేకపోతే చూడలేదు.

Follow Us