ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో పక్కనే విధులు నిర్వహిస్తున్న ఎన్ఎస్జీ కమాండో ఎండ తీవ్రతను తట్టుకోలేక అస్వస్థతకు గురయ్యారు. క్షణాల్లో అప్రమత్తమైన సహచర సిబ్బంది ఆయనను పట్టుకుని సురక్షితంగా బయటకు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది.