AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

ప్యాకేజీ కాదు.. ప్రశాంతత ముఖ్యం.. రూ.17 లక్షల ఉద్యోగాన్ని వదిలేసిన IIT గ్రాడ్యుయేట్

Phani CH
|

Updated on: Apr 20, 2026 | 5:31 PM

Share

కార్పొరేట్ ప్రపంచంలో టాక్సిక్ వర్క్ కల్చర్పై చర్చ జరుగుతోంది. అధిక వేతనాన్ని సైతం వదులుకొని చిరాగ్ మదన్ ఉద్యోగానికి రాజీనామా చేయడం దీనికి ఆజ్యం పోసింది. తీవ్ర పని ఒత్తిడి, విషపూరిత కార్యాలయ వాతావరణమే కారణం. ఆయన వీడియో వైరల్ అవ్వడంతో ఉద్యోగుల ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, పని-జీవిత సమతుల్యత ఆవశ్యకతపై విస్తృత చర్చ జరుగుతోంది. చాలా మంది యువ ప్రొఫెషనల్స్ ఈ సమస్యలను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు.

కార్పొరేట్ ప్రపంచంలో టాక్సిక్ వర్క్ కల్చర్‌పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ట్రిపుల్‌ ఐటీ ఢిల్లీ యువకుడు తనకు వస్తున్న భారీ జీతాన్ని వదులుకుని, ఉద్యోగానికి రాజీనామా చేసిన ఘటన ఆ చర్చకు ఆజ్యం పోసింది. చిరాగ్ మదన్‌ ఓ కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో పనిచేస్తున్నాడు. ఏడాదికి రూ.17 లక్షల ప్యాకేజీ జీతం అందుతోంది. కానీ, ఆ ఉద్యోగంలో ఒత్తిడి భరించలేక రాజీనామా చేశాడు. దీనికి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. పని ఒత్తిడి కారణంగా 10 నుంచి 15 నిమిషాల్లోనే భోజనం ముగించాలని యాజమాన్యం ఒత్తిడి చేసేదని చిరాగ్ వాపోయాడు. ఒకవేళ అనారోగ్యం కారణంగా సెలవు అడిగితే వంద ప్రశ్నలు వేసేవారని, ఆరోగ్యం బాగోలేకపోయినా సెలవు దొరకడం గగనంగా మారిందని అన్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన ఉద్యోగం కాస్తా.. రాత్రి 7 గంటల వరకు సాగేదని, వారానికి 5 రోజులు కాస్తా 6 రోజులకు మారిందని అన్నాడు. సుమారు 10 కోట్ల రూపాయలు విలువైన డీల్స్ క్లోజ్ చేయాలంటూ సేల్స్ టార్గెట్లు ఇచ్చేవారని, అవి పూర్తి చేయకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేసేవారని పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘జీతం కంటే ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ముఖ్యం’ అని చిరాగ్ తీసుకున్న నిర్ణయానికి నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. చాలా మంది యువ ప్రొఫెషనల్స్ తాము కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నామని కామెంట్స్ చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు కూడా ఉద్యోగుల ఆరోగ్యాన్ని విస్మరించకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల జోక్యం తో

ఆ ఆలయంలో అర్చకులుగా.. తరతరాలుగా ఉన్నది వారే

మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్

Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్

Follow Us