Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్
ప్రకాష్ రాజ్ రామ లక్ష్మణులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. రాముడిని కించపరచడం ధైర్యం కాదు, అహంకారం, అజ్ఞానం అన్నారు. రామ నామాన్ని ఎగతాళి చేసే వారికి పతనం తప్పదని, సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని హెచ్చరించారు. తన తల్లి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలో నిర్వహించిన ప్రకాష్ రాజ్, సనాతన ధర్మాన్ని విమర్శించడం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తుందని నాగబాబు విమర్శించారు.
రామ లక్ష్మణుల పై ప్రకాష్ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలపైనే తాజాగా నాగబాబు, ప్రకాశ్ రాజ్‌కు కౌంటర్ ఇచ్చారు. రాముడిని తక్కువ చేసి మాట్లాడటం ధైర్యం అనుకుంటే అది పొరపాటని, అది కేవలం అహంకారం, అజ్ఞానం మాత్రమేనని నాగబాబు ట్వీట్ చేశారు. రామ నామాన్ని ఎగతాళి చేసే వారు తమను తాము నాశనం చేసుకుంటారు తప్ప, సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరన్నారు నాగబాబు. అంతేకాదు రాముడిపై విషం చిమ్మే వారికి.. చరిత్రలో.. అధర్మం వైపు నిలిచిన వారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.తన తల్లి అంత్యక్రియలను క్రైస్తవ పద్ధతిలో నిర్వహించిన ప్రకాష్ రాజ్, సనాతన ధర్మాన్ని విమర్శించడం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విమర్శించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్
ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు
ప్రభుత్వ పాఠశాలలో పాములు.. భయంతో స్టూడెంట్స్ పరుగులు!
పెళ్లయిన ఏడాదికే గల్ఫ్ దేశానికి వలస.. 44 ఏళ్ల తర్వాత శవమై
రహదారుల పై గజరాజుల బీభత్సం వీడియో
వామ్మో.. ఎటు చూసినా పాములే.. భయంతో వణకిపోతున్నారు!
చదువుకోవాలని ఉంది.. కాస్త బస్సు ఆపించండి సార్..
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్‌గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!

