AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు

ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు

Phani CH
|

Updated on: Apr 20, 2026 | 4:06 PM

Share

దర్శకుడు వి. మునిరాజు తెరకెక్కించిన 'తిమ్మరాజుపల్లి టీవీ' 90ల నాటి స్వచ్ఛమైన పల్లె వాతావరణాన్ని, జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. ప్రారంభం నెమ్మదించినా, ద్వితీయార్థంలో టీవీ మిస్టరీ, భావోద్వేగ డ్రామా ఆసక్తిని పెంచుతాయి. సాయి తేజ్ సహజ నటన, పల్లె ఎమోషన్స్‌కు వంశీకాంత్ నేపథ్య సంగీతం ప్రాణం పోశాయి. ఓవరాల్‌గా, నాస్టాల్జిక్ ఫీలింగ్‌తో కూడిన ఈ రూరల్ డ్రామా ప్రేక్షకులను అలరిస్తుంది.

దర్శకుడు వి. మునిరాజు ఎంచుకున్న పాయింట్ చాలా చిన్నదైనా, దాని చుట్టూ అల్లిన డ్రామా ప్రేక్షకులను 90ల నాటి నాస్టాల్జియాలోకి తీసుకెళ్తుంది. అయితే సినిమా ప్రారంభం చాలా నెమ్మదిగా సాగుతుంది. మొదటి భాగం మొత్తం పాత్రల పరిచయం, చిత్తూరు గ్రామీణ వాతావరణం, అక్కడి ప్రజల అమాయకత్వం, వారి మధ్య ఉండే పట్టింపులు, చిన్న చిన్న తగాదాలు, లవ్ ట్రాకులతోనే నిండిపోతుంది. ప్రధాన కథలోకి వెళ్లడానికి చాలా సమయం తీసుకోవడం వల్ల ఫస్ట్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపిస్తుంది. బలమైన సంఘర్షణ లేకపోవడం వల్ల కథనం కాస్త మెల్లగా సాగుతున్న భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ పల్లెటూరి ఎమోషన్స్ అయితే ఎక్కడా మిస్ చేయలేదు దర్శకుడు మునిరాజ్. ఇంటర్వెల్ నుంచి కథనం మారిపోయింది.. ద్వితీయార్థంలో సినిమా అసలు వేగం పుంజుకుంటుంది. టీవీ చుట్టూ జరిగే మిస్టరీ, ఆ తప్పు ఎవరు చేశారు అనే కోణంలో సాగే కథనం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. పల్లెటూరి వాతావరణంలో ఒక చిన్న సమస్య ఎంత పెద్ద ఎమోషనల్ డ్రామాకు దారి తీస్తుందో దర్శకుడు చాలా సహజంగా చూపించాడు. సెకండ్ హాఫ్‌లో దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్‌గా సాగుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు, అన్ని లాజికల్ పాయింట్స్ ను టచ్ చేస్తూ ఇచ్చిన ముగింపు కథనానికి పెద్ద బలాన్నిచ్చాయి. ఫస్ట్ హాఫ్‌లోని లోపాలను సెకండ్ హాఫ్ చాలా వరకు కవర్ చేసిందని చెప్పాలి. ఓవరాల్‌గా ఎమోషన్స్, ట్విస్టులతో సినిమా బాగానే ముందుకెళ్లింది. ఈ సినిమాలో దాదాపు అందరూ కొత్తవారే అయినా ఎక్కడా ఆ ఫీలింగ్ రానివ్వలేదు. హీరోగా సాయి తేజ్, హీరోయిన్‌గా వేద జలంధర్ తమ పరిధి మేరకు చాలా బాగా నటించారు. సాయి తేజ్ పల్లెటూరి యువకుడిగా, ఎమోషనల్ సీన్స్‌లో సహజంగా కనిపించాడు. ప్రదీప్ కొట్టే, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నటీనటులందరూ చిత్తూరు యాసలో అద్భుతంగా మాట్లాడుతూ ఊరి నెటివిటీని తీసుకురావడంలో 100 శాతం సక్సెస్ అయ్యారు. అతిగా నటించకుండా తమ పరిధిలో అద్భుతంగా చేశారు.టెక్నికల్‌గా ఈ సినిమాకు ప్రధాన బలం వంశీకాంత్ రేఖన అందించిన నేపథ్య సంగీతం. సాధారణ సన్నివేశాలకు కూడా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. సుధీర్ మాచర్ల ఆర్ట్ వర్క్ 90స్ నాటి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా కళ్లకు కట్టింది. అక్షయ్ రామ్ కెమెరా పనితనం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా నేచురల్‌గా ఉంది. కిరణ్ అబ్బవరం లాంటి హీరో నిర్మాతగా మారి తన ప్రొడక్షన్‌లో ఇలాంటి ఒక ప్రయోగాత్మక రూరల్ డ్రామాను ఎంచుకోవడం అభినందించదగ్గ విషయం. ఖర్చు తక్కువే అయినా మేకింగ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మునిరాజు దర్శకత్వం కూడా మెప్పించింది. ఓవరాల్‌గా తిమ్మరాజుపల్లి టీవీ.. 90ల్లోని జ్ఞాపకాలు.. స్వచ్ఛమైన పల్లెటూరి కథ..!

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Anna Rajan: సబ్‌స్క్రిప్షన్‌ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు

ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !

చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??

ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్‌ విషయం విన్నారా ??

Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్

Follow Us