Anna Rajan: సబ్‌స్క్రిప్షన్ అంటే బూతు కంటెంట్ కాదు.. నాదగ్గర కథలొద్దు
మలయాళ నటి అన్నా రేష్మా రాజన్ తన ఇన్‌స్టాగ్రామ్ సబ్‌స్క్రిప్షన్ గురించి వస్తున్న అపోహలను నివృత్తి చేశారు. తన సబ్‌స్క్రిప్షన్‌లో అసభ్యకరమైన కంటెంట్ ఉండదని, కేవలం వృత్తిపరమైన, నాణ్యమైన మరియు గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఫాలోవర్లతో మరింత దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి, రీల్స్, ఫోటోలకు ముందస్తు యాక్సెస్ ఇవ్వడానికే ఇది అని వివరించారు.
ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో సబ్‌స్క్రిప్షన్ గోల ఎక్కువైపోయింది. చాలామంది సబ్‌స్క్రిప్షన్ అనగానే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని భావిస్తున్నారు. తన దగ్గర మాత్రం అలాంటివి ఆశించొద్దంటోంది మలయాళ నటి అన్నా రేష్మ రాజన్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టి.. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది ఈ బ్యూటీ. తన అకౌంట్‌లో సబ్‌స్క్రిప్షన్‌ను రెండేళ్ల క్రితమే స్టార్ట్ చేశానని చెప్పిన రేష్మ రాజన్.. సబ్ స్క్రిప్షన్‌తోనే తన ఫాలోవర్స్‌ను కనెక్ట్ అవుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు సబ్‌స్క్రిప్షన్ వల్ల తన రీల్స్, ఫోటోలు ముందుగానే తన ఫాలోవర్స్‌కు పంచుతున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు తనతో కాస్త ఎక్కువగా కనెక్ట్ అవ్వాలనుకునే తన ఫాలోవర్స్‌కు సబ్‌స్క్రిప్షనే బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు రేష్మ. అయితే సబ్‌స్క్రిప్షన్ అంటే అక్కడేదో బూతు కంటెంట్ ఉంటుందని కాదని.. కేవలం క్వాలిటీ, సృజనాత్మకత, గౌరవప్రదమైన సంభాషణలు మాత్రమే ఉంటాయంటూ చెప్పుకొచ్చారు రేష్మ. అంతేకాదు ఏదేదో.. ఊహించుకుని మాత్రం తన అకౌంట్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోకండి అంటూ చెబుతున్నారు. కేవలం వృత్తిపరమైన విషయాలు మాత్రమే ఉంటాయని.. ఈ విషయం క్లియర్‌గా చెప్తున్నా అంటూ తన ఇన్‌స్టాపోస్టులో రాసుకొచ్చారు రేష్మ. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతూనే.. ఓ వర్గం నుంచి విమర్శలు వచ్చేలా చేసుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా ??
ఇక రైళ్లలో 'డగ డగ' శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్

