ఇక రైళ్లలో ‘డగ డగ’ శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
భారతీయ రైల్వే ప్రయాణికులకు మరింత సుఖవంతమైన, భద్రమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో ఆధునిక పద్ధతులను ప్రవేశపెడుతోంది. తేలికైన, దృఢమైన కాంపోజిట్ స్లీపర్లను వాడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో ట్రాక్‌లను పర్యవేక్షించడం వీటిలో ప్రధానం. రైలు కుదుపులు, శబ్దాలు తగ్గి, ట్రాక్ లోపాలను ముందుగానే గుర్తించడం ద్వారా ప్రమాదాలు నివారించబడతాయి, ఆలస్యాలు తగ్గుతాయి.
రైలు ప్రయాణంలో కోచ్ లో లోపాల కారణంగా కుదుపులు, డగడగ శబ్దాలకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. ప్రయాణికులకు మరింత సుఖవంతమైన, భద్రమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే నిర్ణయాలు తీసుకుంది. పట్టాల కింద కంపోజిట్ స్లీపర్లను వాడటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాయంతో ట్రాక్‌లను పర్యవేక్షించడం వంటి ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం వాడుతున్న ఇనుము, కాంక్రీట్ దిమ్మెల స్థానంలో తేలికైన, దృఢమైన ఫైబర్ కంపోజిట్ దిమ్మెలను ఉపయోగించనున్నారు. వీటి వల్ల రైలు ప్రయాణంలో వచ్చే కుదుపులు, శబ్దాలు తగ్గుతాయి. ముఖ్యంగా వంతెనలు, క్రాసింగ్‌ల వద్ద వీటిని అమర్చడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. ఈ దిమ్మెల నిర్వహణ ఖర్చు తక్కువ కావడం, మరమ్మతులు కూడా తేలిక కావడం అదనపు ప్రయోజనం. రైల్వే భద్రతను మరింత పెంచేందుకు ఏఐ టెక్నాలజీని వాడనున్నారు. ఇన్‌స్పెక్షన్ వాహనాల్లో అమర్చిన గ్రౌండ్ పెనెట్రేషన్ రాడార్ సాయంతో ట్రాక్ కింద భూమి స్థితిని ఏఐ విశ్లేషిస్తుంది. దీనివల్ల ట్రాక్‌లో కంటికి కనిపించని లోపాలను కూడా ముందుగానే గుర్తించి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది. రైలు ముందు భాగంలో ఏఐ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి, పట్టాలపై వస్తువులున్నా లేదా ట్రాక్ దెబ్బతిన్నా ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఏఐ సాంకేతికత అమలుతో రైలు ప్రయాణంలో వైబ్రేషన్స్ తగ్గడమే కాకుండా, ట్రాక్ సమస్యలను ముందుగానే గుర్తించి ప్రమాదాలను నివారించే అవకాశం పెరుగుతుంది. ప్రయాణంలో ఆలస్యం కూడా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
ఉదయాన్నే ప్లెయిన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా ??
Rashmika Mandanna: వైరల్ అవుతున్న రష్మిక మేకప్ టాపిక్
ఇక రైళ్లలో 'డగ డగ' శబ్దాలు వినిపించవు.. కుదుపులూ తగ్గుతాయి.. !
చైనా యావో మహిళల పొడవైన జుట్టు సీక్రెట్.. రైస్ వాటరా ??
స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తి.. అంతలోనే..
సామాన్య పాస్టర్ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు
పేద భక్తులకు రూ.100కే శ్రీకాళహస్తిలో రాహు-కేతు పూజ
గ్యాస్ రాలేదు కానీ.. డెలివరీ అయినట్లు ఓటీపీ వచ్చింది
సార్.. ఎలాగైనా పాస్ చేయండి ప్లీజ.. విద్యార్థి ఫోన్ కాల్

