మరో తెలుగు సినిమాలో ఛాన్స్ అందుకున్న మాళవిక మోహనన్.?

Rajeev 

19 April 2026

అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయిన హీరోయిన్ అందాల భామ మాళవిక మోహనన్.

2013లో బట్టం బోలే సినిమాతో మలయాళీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన పెట్టా చిత్రంలో కనిపించింది.

ఈ మూవీతో తమిళం ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకుంది.

అక్కడ  ధనుష్, విజయ్ దళపతి, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన మాళవిక.. ఇటీవలే తెలుగులోకి అడుగుపెట్టింది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హారర్ కామెడీ మూవీ రాజా సాబ్ సినిమాలో నటించింది మాళవిక. 

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. 

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో క్రేజీ ఆఫర్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని అంటున్నారు.