పవన్‌తో బ్లాక్ బస్టర్.. రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్.. బ్యూటీకి ఛాన్స్
Rajitha Chanti
Pic credit - Instagram
19 April 2026
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ చక్కర్లు కొడుతుంది.
రామ్ చరణ్ సినిమాల్లో పాటలకు, అందులోనూ ఆయన వేసే మాస్ స్టెప్పులకు ఉండే క్రేజ్ ప్రత్యేకమైంది. 'రంగస్థలం'లో "జిగేలు రాణి" సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అదే స్థాయిలో బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న 'పెద్ది'లో ఒక అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశారట. ఈ పాటలో చరణ్‌తో కలిసి చిందేయబోయే ఆ బ్యూటీ గురించి చర్చ నడుస్తుంది.
ఈ స్పెషల్ మాస్ నంబర్ కోసం గతంలో మృణాల్ ఠాకూర్, మానస వారణాసి వంటి పేర్లు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం యంగ్ హీరోయిన్ ఎంపికైందని టాక్.
ఆమె మరెవరో కాదు.. సంయుక్త మీనన్. ఈ బ్యూటీ పేరును చిత్ర బృందం ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.
ఇటీవల 'అఖండ 2: తాండవం' చిత్రంలో "జాజికాయ జాజికాయ" పాటతో మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించింది. ఇప్పుడు రామ్ చరణ్‌తో కలిసి స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది.
ఏ.ఆర్. రెహమాన్ అద్భుతమైన ట్యూన్ అందించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పవర్ ఫుల్ స్పోర్ట్స్ డ్రామా ఇది.
ఇందులో రామ్ చరణ్ మునుపెన్నడూ చూడని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. అలాగే ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.